పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

ఇంతవరకు ప్రతివాదులు చూపిన 'గ్రంథగ్రంథిం తదా' అను శ్లోకములకు పూర్వగ్రంథము. తరువాత 80. 81. 82. శ్లోకములు ప్రతివాదు లుదాహరించినవే. ఆ పైనున్న 83వశ్లోకమిది.----

    “సర్వజ్ఞోపి గణేశో యత్ కణ మాస్తే విచారయన్ |
     తావ చ్చకార వ్యాసో౽పి శ్లోకొ నన్యాన్ బహూనపి |"

“గ్రంథగ్రంథిమ్' ఇత్యాది నాల్గుశ్లోకములకు తాత్పర్యం మేమనగా---

గణపతి వ్రాయునపుడు ముహర్షి - కుతూహలముతో గూఢముగా గ్రంథగ్రంథిని చేసెను. ఆగ్రంథులవిషయమై చెప్పుచు 8800 శ్లోకములు నాకు శుకునకు తప్ప అన్యులకు దురవగాహము లని ప్రతిజ్ఞ చేసెను. ఆశ్లోక కూట మిప్పటికి అర్థము గూఢమగుటచేతను, గౌణ్యాదివృత్తి భేదమున శబ్దము గూఢ మగుటచేతను అభేద్యమైయున్నది. సర్వజ్ఞుడగు గణపతికూడ నాశ్లోకములు వినినప్పుడువ్రాయుట మాని
యర్థ గ్రహణమునకై క్షణకాలము ఆలోచించుచుండువాడు. అంతలో వ్యాసమహర్షి ఇతరములైన బహుశ్లోకములను చెప్పుచుండువాడు. అని,


దీనినిబట్టి గణపతి వ్రాతలోని వేగమునరికట్టుటకై నడుమ గూఢశ్లోకములు చొప్పించె ననియు, నట్టిగూఢ శ్లోకములే 8800లనియు, అవికాక గ్రంథ మెంతో కలదనియు స్పష్టముగా జెప్పబడియుండ, నావిషయము తెలియకుండుటకై 74 మొదలు 79 వరకు గల పూర్వశ్లోకములను, కడపటి 83 వ శ్లోకమును ప్రదర్శింపక ప్రతివాదులు మాయచేసినారు.

మఱియు 'గ్రంథగ్రంథిమ్ ' అనునపుడు శబ్దజ్ఞాన మున్నవానికి