పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

మహాభారతతత్త్వ కథనము

తత్పురుష సమాసమునుబట్టి గ్రంథికంటె వేఱుగా గ్రంథ ముస్నదని తెలియుచునే యున్నది. మరియు ప్రతివాదులలో నొకరగు మహాభారతమీమాంసాకారులు.. 'మేక్డనాల్డ్ బేబరు మొదలైన పాశ్చాత్యవి ద్వాంసులు ఆశ్లోకముల (జయమందలి శ్లోకముల) సంఖ్య 8800 అయి యుండె నని చెప్పుచున్నారు కాని యీమతము మనకు గ్రహింపదగినది కాదు ... మహాభారతమున 8800 సంఖ్య యొక్క యుచ్చారణము వ్యాసమహర్షియొక్క కూటశ్లోకముల నుద్దేశించి వచ్చినది' అనుచు నీ మ|| భా || చ|| కారుల వాదమును త్రోసివేసియే యున్నారు.

మఱియు ప్రతివాదులలోనే మరియొకరగు శ్రీకృష్ణ చరిత్రకారులుకూడ ఏకాదశ పరిచ్ఛేదమున నిట్లు వాసియున్నారు... -

“మహాభారతమును అనేక పర్యాయములు చదివియును ... విచారణ చేసియును గ్రంథ విషయమును ముందు వేరు వేరు అంత రములుగా విభజింపవచ్చునని యోజించితిమి. మొదటిది మూల కథ ... అందు పాండవుల జీవనవృత్తాంతమును, తత్సంబంధమగు కృష్ణకథయును తప్ప మరేమియును లేదు... ఇదియే చతుర్వింశ సహస్ర (24 నేల) శ్లోకాత్మకమైన భారతసంహితగా కనబకు చున్నది”

ఇట్లు వ్రాసిన వీరుకూడ 8800 శ్లోకములే మొదటిగ్రంథ మను మ|| భా || చ|| కారుల వాదమును త్రోసి నేసియే యున్నారు. ఇట్లు ప్రతివాదులలోగూడ కొందరిచే త్రోసివేయబడి ప్రకరణవిరుద్ధమై యున్న యీవాదము హేయమే. (ఇచ్చట 24 వేలగ్రంథ మే మొదటిది (వ్యాసునిది) అనువాదము వెనుక విమర్శింపబడి లక్ష గ్రంథము మొదటిది. దాని సంగ్రహము 24 వేలు అని నిరూపింపబడినదను సంగతిని మఱువకుడు)