పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

మహాభారతతత్త్వ కథనము

మరియు 'షష్టిం శతసహస్రాణి చకారాన్యాం స సంహితామ్ అను 106వ శ్లోకమునుండి, వ్యాసవిరచితమై 60 లక్షల గ్రంథముకల భారతసంహితలో నేలోకమున నెంత కలదో ఎవ్వనిచే వినిపింపబడినదో చెప్పెడి సందర్భములో దేవలోకమందున్నది. 30 లక్షలు వినిపించిన వాడు నారదు డనియు, పితృలోక మందున్నది 15 లక్షలు వినిపించిన వాడు, అసితదేవలు డనియు, గంధర్వలోకమం దున్నది. 14 లక్షలు వినిపించినవాడు శుకయోగియనియు చెప్పి “ఏకం శతసహస్రంతు మానుషేషు ప్రతిష్ఠితమ్' 'అస్మింస్తు మానుషే లోకే వైశంపాయన ఉక్తవాన్ ' అనుచు మనుష్యలోకమందున్నది 1 లక్ష. వినిపించినవాడు వైశంపాయనుడు అని చెప్పినపుడు, 30-15-14-1 కలిపిన గాని ఆ 60 లక్షలు పూర్తిగా సిద్దింపకున్నపుడు ఏ సందర్భము గమనింపక "వైశంపాయన ఉక్తవాన్' అను వాక్యమును చూసి భారతకర్త వై శంపాయనుడనుచు వ్రాసిన ప్రతివాదులు మతిమంతులనిపించుకొనరు మఱియు “ఇదం శత సహస్రం హి శ్లోకానామ్ పుణ్యకర్మణామ్ | సత్యవత్యాత్మజే నేహ వ్యాఖ్యాత మమితౌజసా” (ఆది. 62 అ) అనుచు ఈ లక్షగ్రంథము వ్యాసప్రోక్తమని జనమేజయునకు వైశంపాయనుడే చెప్పియుండెను. ఇట్లు పరీక్షింపగా వైశంపాయనునకు భారతకరృత్యము తొలగిపోయినది, వ్యాసమహర్షికే కర్తృత్వము స్థిరపడినది,

(4) ఇక సౌతికి మహాభారతకర్తృత్వము సాధించుటకు ప్రతివాదులు చూపిన వాక్య మిది.

"ఏకం శతసహస్రంతు మయోక్తంవై నిబోధత"

టీ|| "మయా ఉచ్యమానం, వైశంపాయనే నోక్తం, నిబోధత అర్థతో బుధ్యధ్వమ్'

అనగా, పూర్వము వైశంపాయనునిచే చెప్పబడినట్టియు మీకో