పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

27

60లక్షల భారత సంహితను చేసెను. అందు 30 లక్షలు దేవలోక మందును,15 లక్షలు పితృలోకమందును. 14లక్షలు గంధర్వలోక మందును, 1లక్ష మనుష్యలోక మందును ప్రతిష్ఠితమై యున్నది.

అందు దేవతలకు నారదుడును, పితృదేవతలకు అసిత దేవలుడును, గంధర్వాదులకు శుకుడును వినిపించిరి.

(ఈ వాక్యము "నారదో౽ శ్రావయద్దేవాన్" 'గంధర్వయక్షరక్షాంసి శ్రావయామాస వై శుకః' అను శ్లోకార్థమే ఇచ్చట అశ్రావయత్ ” “శ్రావయామాస' అనుటచే వినిపించె ననియే యర్థ మనుట నిర్వివాదము)

ఈమనుష్యలోకమునకు వ్యాసశిష్యుడు ధర్మాత్ముడు నగు వైశంపాయనుడు చెప్పెను, అనగా వినిపించెను,అని.

ఇట్లు ఎవ్వరెచ్చట వినిపించిరో చెప్పెడి సందర్భములో నున్న "అస్మింస్తు మానుషేలోకే వైశంపాయన ఉక్తవాన్ అను వాక్యమందలి 'ఉక్తవాన్ ' అను పదమునకు రచించెనని యర్థమును ప్రతివాదులు చెప్పుట అక్రమము. మఱియు “అబ్రవీద్భారతం లోకే మానుషేస్మిన్మహా నృషిః | జనమేజయేన పృష్టస్సన్ 97 'శశాస శిష్య మాసీనం వైశంపాయన మన్తికే | స సదస్యై స్సహాసీన శ్శ్రావయామాస భారతమ్" 98 అను పూర్వోక్త శ్లోకములలో సత్ర యాగములో జనమేజయునకు నీవు వినిపింపుమని శిష్యుడగు వైశంపాయనునకు ఆజ్ఞాపించిన వ్యాసమహర్షియే 'అబ్రవీద్బారతం లోకే మానుషేస్మిన్' ఈమనుప్యలోకములో చెప్పెనని యుండుటచే దానికిగూడ ప్రతివాదులవ్రాత విరుద్దము. మరియు ఆ వైశంపాయనుడు “ శ్రావయామాస భారతమ్" భారతము వినిపించెను అని యుండుటచే దానికి విరుద్దము.