పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

మహాభారతతత్త్వ కథనము

వేదా యోగ స్సవిజ్ఞానో ధర్మో౽ర్థః కామ ఏవచ |
ధర్మ కామార్థయుక్తాని శాస్త్రాణి వివిధాని చ|
లోకయత్రావిధానం చ సర్వం తద్దృష్టవా నృషి. (అ.I)

అనగా దుర్గనగరాదులను, తీర్థక్షేత్రాదులను, ధర్మార్థ కామరహస్యములను, కర్మకాండమును, ఉపాసనాకాండమును, జ్ఞానకాండమును, స్మార్తధర్మమును, లోకప్రసిద్ధములగు అర్థకామములను, ధర్మార్థకామ ప్రతిపాదకములగు వివిధశాస్త్రములను, లోకయాత్రానిర్వాహకములగు ఆయుర్వేదధనుర్వేదగాంధర్వ వేదముల విధులను, సర్వమును యోగశక్తిచే మహర్షి ప్రత్యక్షము చేసికొనెను. అనితాత్సర్యము మఱియు సౌతి శౌనకున కిట్లు చెప్పెను:

“ఏత త్తే సర్వ మాఖ్యాతం వైశంపాయనకీర్తితమ్|
వ్యాసాజ్ఞయా సమాజ్ఞాతం సర్పసత్రే నృపస్య హి ||

పుణ్యోఽయ మితిహాసాఖ్యః పవిత్రం చేద ముత్తమమ్|
కృష్ణేన మునినా విప్ర నిర్మితం సత్యవాదినా||

సర్వజ్ఞేన విధిజ్ఞేన ధర్మజ్ఞానవతా సతా |
అతీన్ద్రియేణ శుచినా తపసా భావితాత్మనాః||

ఐశ్వర్యే వర్తతా చైవ సాంఖ్యయోగవతా తథా|
నైకతంత్రవిబుద్ధేన దృష్ట్వా దివ్యేన చక్షుషా ||

కీర్తిం ప్రథయతా లోకే పాండవానాం మహాత్మనామ్|
అన్యేషాం క్షత్రియాణాం చ భూరిద్రవిణ తేజసామ్||

క్రీడాంచ వాసుదేవస్య దేవదేవస్య శార్ఙ్గిణ:|
విశ్వేషాందేవభాగానాంజన్మసాయుజ్యమేవ చ || (స్వర్గ.ప. శ్లో34_39 )

శౌనకమహర్షీ ! జనమేజయుని సర్పసత్రమందు వ్యాసమహర్షియాజ్ఞచే వైశంపాయనకీర్తితమై చక్కగా దెలిసికొనబడిన దీనినంతను