పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(2)

అనేక కర్తృత్వ నిరాకరణము

5

దును ఆవిర్భవింపక ఆవల్లి యంతయు నారూపముతో నేకకాలమందే యావిర్భవించినట్లు యీమహాభారతము కూడ నేక కాలమునందే యథాశ్రుతరూపముతో వ్యాసమహర్షి చేతనే యావిర్భూతమైనదని యర్థము.

ఈ పద్ధతి యొక మహాభారతమందే కాక ఆర్ష గ్రంథములయందు సుప్రసిద్ధమే. వాల్మీకి రామాయణమందు ప్రధమసర్గ మగు బాల రామాయణము సూత్రభూత మనియు పైగ్రంథము దానికి వ్యాఖ్యానభూత మనియు తజ్ఞులకు విదితమే. భగవద్గీతలో గూడ పంచమాధ్యాయాంత మందు "స్పర్శాన్ కృత్వా బహి ర్బాహ్యాన్ ఇత్యాది శ్లోకత్రయముచే ధ్యానయోగమును సూత్రప్రాయముగా జెప్పి దానినే షష్ఠాధ్యాయము లో విస్తరించి చెప్పెను. ఈ విషయమై షష్ఠాధ్యాయారంభమందు శాంకరభాష్య మిట్లున్నది -

"అతీతానన్తరాధ్యాయాన్తే ధ్యానయోగస్య సమ్యగ్దర్శనం ప్రత్యన్తరఙ్గస్య సూత్రభూతా శ్శ్లోకాః 'స్పర్శాన్ కృత్వా బహిః” ఇత్యాదయ ఉపదిష్టా స్తేషాం వృత్తిస్థానీయో౽యం షష్ఠాధ్యాయ ఆరభ్యతే"

ఇట్లు చూడగా మొదట సూత్రప్రాయముగా జెప్పి తరువాత దానిని వివరించి చెప్పుచుండుట ఆర్షగ్రంథలక్షణ మని విజ్ఞులకు విదితమే. కనుక నీమహాభారతము కూడ నట్టి రచనయే కలిగి యున్నదనుట అపూర్వము కాదు.

———♦ మహాభారతకర్తృ ప్రభావము ♦———

ఇక మనము మహాభారతకర్తృప్రభావమును గూడ నొకింత గ్రహింపవలసియున్నది. అది యిట్లు చెప్పబడినది-

“భూతస్థానాని సర్వాణి రహస్యం త్రివిధం చ యత్ |