పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

69


రఘునాథతనయుఁడు రమ్మని తనుఁ బిల్చి
        చాల లాలించెగా చల్లఁగాను
మండలాధిపులతో మాటలాడని మేటి
        ననుఁ బిల్చి మాటాడె నమ్ము మనుచు


తే.

సొంతభాగ్యంబు సేసితి నెలమి నేను
కలిగె నింతటిదొరసముఖంబు తనకుఁ
బంత మీ డేర్పఁ గంటిని పణఁతి కిపుడె
యనుచుఁ బల్కుచు నట వచ్చు నవసరమున.

71


క.

కాంతిమతియు నవ్వనమున
మంతనమున నుండి చాల మరుకాఁకలచే
నింతింతనరాని తమిన్
జింతింపఁగఁ దొణఁగె దనదు చిత్తములోనన్.

72


సీ.

పంతముల్ వల్కి నాపతినిఁ గూర్చెద నని
        జలజాక్షి చనియెగా సముఖమునకు
[1]మన్నారుదాసుతో మాటలాడఁగ వేళ
        కలుగునో కలుగదో! కమలముఖికి
రాజసంబున నల రాజాధిరాజు దాఁ
        బలుకునో బలుకఁడో! భావ మలర
మచ్చరంబున పద్దిమగువ లీ కార్యంబుఁ
        జెలువుండు వినకుండ సేతు రొక్కొ!


తే.

ఏల చెలి తామసించెనో? యింతసేపు
మించుఁబోణి తడవు [2]తామసించె నపుడె
పూనినటువంటి కార్యంబుఁ బొంకముగను
నిర్వహించుట తోఁచెను నెమ్మనమున.

73


తే.

అనుచు నాలోచనలు సేయునట్టి వేళ
వామనేత్రాంసకుచములు వరుస నదరెఁ
గలకలంబుగ దక్షిణగౌళి వలికె
వేగఁ బెండ్లి కుపశ్రుతి వినఁగ నయ్యె.

74
  1. మన్నరు. క. మన్నారు.
  2. తామసించినపుడె?