పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

మన్నారుదాసవిలాసము


వాసనచే మగువా! కంకేళికి
నాస యొనర్చెద వందునె కేళికి
అతివరొ! చేరువ నదె మాకందము
ప్రతి లేనిది యిది పదమా కందము
చక్కని యీవిరిసర మే నమ్మను
చిక్కులమాటలు చెలి! నే నమ్మను
కనకము చెలఁగెడు కను మాచాయను
కనకము మీరఁగ గల విరి చాయను
కొసరఁగ నేటికిఁ గొన గోరంటను
కుసుమముఁ గోయుము కొనగో రంటను
[1]సురపొన్నలగమి చూడవె యిచ్చట
గరితకు దీనిన్ గనుటకె యిచ్చట
అని పల్కుచుఁ దగ నందఱు ముదమున
ననలుఁ జిదిమి రెంతయు సమ్మదమున.

79


చెలులు కాంతిమతితోఁ గలిసి జలకేళి సల్పుట

వ.

అంత.

80


సీ.

పొడమిన నెమ్మేని బడలికల్ దీరంగఁ
        జల్లని పన్నీరుఁ జల్లుకొనుచుఁ
బటువుగుబ్బలమీఁది పయ్యదల్ బొదలంగ
        విరితావిసురఁటుల విసరికొనుచుఁ
దీరైన చెక్కిళ్ళ దిగజారు చెమటల
        నొనరఁ బావడలచే నొత్తుకొనుచు
[2]నందంద చెలు లిచ్చు గందంపుజలములఁ
        గూడి వసంతంబు లాడికొనుచు


తే.

మిగుల లేమావినీడల మెచ్చికొనుచు
నింపుగల తావితెమ్మెర కెదురుకొనుచు
వెలయ జలకేళిమీఁదను వేడ్క బొడమ
నంబుజాక్షులు నడచి రొయ్యార మమర.

81


వ.

ఇట్లు చని చని.

82
  1. సురబొన్నల క. సురబొన్నల
  2. నందెంది క. నందెంది.