పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

43


భామిని! తగునే పలుమరుఁ జీరఁగఁ
[1]గొమరగు నీలత గోరను జీరఁగ
నెనసిన చెలితో నేలే వాదులు
వనిత! నీకు లేవా విరవాదులు
చెలియరో! లాగించెదు తెకతేరకు
నలరులగుత్తులకై యేతేరకు
చెలిమిమీర నిచ్చితి వీమరువము
నలినేక్షణ! యెన్నటికిని మరువము
నెరసెను మొగ్గలు నిచ్చలు పొగడను
తరుణిరొ! దీనినె తగదా పొగడను
నారీమణి! యీనన నీకంటివె
యారమణి కొసఁగె నదిగో కంటివె
ఆమనిఁ దలఁపఁగ నలరుల చేరువ
రామరొ! యీపొద రమ్మా చేరువ
యెన్నిక మీరఁగ నీచెలిదండను
గ్రొన్నన లన్నియుఁ గూర్పుము దండను
చానరొ! యాడించకు మీనెమ్మిని
మానిని కెరవగు మానుము నెమ్మిని
అరుగకుమీ నీ వయ్యెడఁ బొదలను
దిరిగెడుఁ దఱచై తేఁటులు పొదలను
చిక్కు దీయవే చెలియరొ! సరిపెన
యొక్కటియై యిపు డున్నది సరిపెన
తరలకు దవ్వుగ తగదన నేరమె
హరిణేక్షణ! మే మట చననేరమె
కలవే యామని ఘనముగ జాతులు
నెలఁతరొ! నాతోనేనా జాతులు
[2]మీరిన బంతులు మొచ్చుగ నీవలె
వేరుసేయకే వెలఁదీ! నీవలె
వనితా! పొదలను వలనే దూరఁగ
చనకు మన్న నను చనునే దూరఁగ
కోమలి! యిచ్చెదఁ గొనుమీ సరములు
కామునిపూజకుఁ గడు మీసరములు

  1. గొనుగు
  2. ఈ రెండు పంక్తులును క గ్రంథమున ముందు వెనుకలుగ నున్నవి.