పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

[v]

కృతినాయకుని పేరు మొదలగు వానిని మాత్రము మార్చివేసి మిగిలిన భాగముల నటులనే యుంచఁగా సిద్ధించిన గ్రంథ మిది. ఇది బాహాటముగా జరిగిన గ్రంథచౌర్యముతక్క వేరు కాదు. అదియునుగాక సౌందరీదేవియొక్క యునికియే సందేహాస్పద మౌటను జరిత్ర రుజువుచేయుటయు వింతలో వింత. పై “యల్లాడ విజయభూపతిసింహవిలాస" మతిస్వల్ప మగు మార్పులతో నీ రంగాజమ్మకృతి యగు మన్నారుదాసవిలాసమే గాని వేరు కాదనుట స్పష్టము. నాయకనామాదుల మార్పుల కాస్కారము లేని చోట్ల మన్నారుదాసవిలాసములోని పద్యముల నటులనే యాగ్రంథమునందుఁ జూడఁగలుగుటయు నీ యభిప్రాయమును మఱింత బలపరచుచున్నది. చూడుడు:-

మన్నారుదాసవిలాసము - ద్వితీయాశ్వాసము ప. -3

ఉ. ఎంతయు వేడ్కగాంచ నవనీశు మహోత్సముం గనుంగొనన్
    గాంతలు తాము లోకమునఁ గల్గు బుధోత్తము లేఁగుదేర న
    త్యంతమనోహరాకృతిని దానును వచ్చె వసంత మంత నే
    కాంతసుగంధవాసితదిశాంతలతాంతము సంతసంబునన్.

అల్లాడ విజయభూపతిసింహవిలాసము - ద్వితీయాశ్వాసము

ఉ. ఎంతటి వేడ్కగాంచె నవనీశుమహోత్సవముం గనుంగొనన్
    కాంతలు దాము లోకమునఁ గల్గు బుధోత్తము లేఁగుదేర న
    త్యంతమనోహరాకృతిని దానును వచ్చె వసంత మంత నే
    కాంతసుగంధవాసితదిశాంతలతాంతము సంతసంబునన్.

ద్వితీయాశ్వాసముఅల్లాడ

మన్నారుదాసవిలాసమువిజయభూపతిసింహవిలాసము

మొదటి పద్యము

క. శ్రీ విజయ రాఘవాధిప క. శ్రీ విజయము పతినృప భూవలఁగు ప్రాజ్య రాజ్యపోషణద దా! భూవలయ ప్రాజ్య రాజ్యపోషణద కా! శ్రీవత్సక లితవజా! శ్రీవత్సక లితవనా! శ్రీ విజితఘవప్రకాళ! చెంగమలేశా! శ్రీవకమ హేద్రపురీశ! శ్రీలక్ష్మీశా! అదియునుంగాక యీ క్రింది పద్యములను బరిశీలించిన నా మె చేసిన గ్రంథ చౌర్యము జట్టబయలు కాఁగలదు. కడపటి చరణమున యతిస్థానమునకు సరివచ్చు .