పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

మన్నారుదాసవిలాసము


క.

కాంతిమతిఁ దోడితెమ్మని
యింతులతో విజయరాఘవేంద్రుఁడు బలుకన్
గంతునిచెంతకు నల రతి
కాంతను దోడుకొనివచ్చుక్రమ మమరంగన్.

94


క.

ఎంతయు నీభవనము కడు
వింతగు శృంగారములను వెలసెను జాలన్
సంతసమునఁ గనుగొందము
కాంతిమతీ! రమ్మటంచుఁ గాంతలు బలుకన్.

95


సీ.

సిగ్గుచే నప్పుడు చిఱునవ్వు నవ్వుచు
        భామలు తనుఁ బిల్చు భావ మెఱిఁగి
ఘల్లుఘల్లని పాదకటకముల్ మోయఁగా
        రాయంచనడపుల రంగుమీర
రతనాలకమ్మల రహిమించు కొంతులు
        చెక్కుటద్దంబులఁ జికిలిసేయఁ
దీరైన యాణిముత్తియముల హారముల్
        కులుకుగుబ్బలమీద గునిసియాడ


తే.

[1]అసదుఁ గౌ నసియాడఁగా నందముగను
వేడ్కతో వచ్చి యచ్చట విభునిఁ జూచి
సిగ్గు మురిపెంబు ప్రేమయుఁ జెలగ నపుడు
మగువ యపరంజికంబంబు మఱుఁగుఁ జేరె.

96


వ.

ఆసమయంబున.

97


సీ.

[2]ఇంత సిగ్గేటికే? యింతిరో నీకని
        సంతసంబునఁ బల్కె సకియ యొకతె
[3]వనితరో! నేను నీమన సెఱుంగనే యని
        సరసమాడుచు బల్కె తరుణి యొకతె
జాగేల సేసెదు? జాణరో! నీ వని
        ముద్దుగులుచు బల్కె ముదిత యొకతె
కంబము చాటేల? కాంతరో! నీ కని
        మగువ, యొక్కతె బల్కె మచ్చి కలర

  1. అసుదు క. అసుధు
  2. ఇంతి
  3. వనితరా