పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

115


క.

నగరిహజారముచెంగటఁ
బొగడఁగ నేనుగను డిగ్గి భూవిభుఁ డమరన్
దగ నింతి చెట్ట బట్టుక
జిగి మించిన పెండ్లిచవికెఁ జేరఁగ వచ్చెన్.

90


క.

అంగనయుఁ దాను నప్పుడు
బంగరుపీఁట న్వసించి భామలు మది ను
ప్పొంగుచు సేసలువెట్టఁగ
[1]రంగలరుచు నుండె విజయరాఘవుఁ డంతన్.

91


పడతులు శయ్యాగారము నలంకరించుట; సంయోగవియోగశృంగారములు

సీ.

బంగారుపడకింట బాగుగా నొకయింతి
        రతనాలమంచంబు రహి నమర్చె
సొగసుమీరిన యొక్కశుకవాణి కుంకుమ
        పూలపాను పమర్చెఁ బొంకముగను
మిక్కిలివేడ్కచే మెలఁత యొక్కతె పట్టు
        తలగడ లమరించెఁ జెలువుమీరఁ
గోమలి యొక్కతె కూర్చినజూజులుఁ
        జప్పరంబునఁ గట్టె నొప్పుగాను


తే.

మఱియు నొకకొంద ఱతివలు తఱచుగాను
గందమును గుంకుమంబును గస్తురియును
జాతిపన్నీరు నరవికిసరులు సురఁటి
నిలువుటద్దంబు లచ్చట నిలిపి రెలమి.

92


క.

అంగనలు కేళిభవనము
శృంగారించితిమి యనుచుఁ జెలువుగఁ దెలుపన్
బంగరుమంచముమీఁదను
రంగలరుచు నుండె విజయరాఘవుఁ డంతన్.

93
  1. క.రంగలరుచు విజయరాఘవుఁ డంతన్