పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

మన్నారుదాసవిలాసము


        రామకు ముత్యాలరవికఁ దొడిగి
విదియచందురు మీరు నుదిటిపైఁ దీరుగా
        సుదతికి జాతికస్తూరి దిద్ది


తే.

యువిదకన్నులఁ గాటుక నొప్పఁ దీర్చి
పొలఁతిచెక్కిటిపై దృష్టిబొట్టుఁ బెట్టి
వనితవీనుల జవ్వాది నొనర నుంచి
యిందుముఖిమేనఁ గుంకుమగంద మలది.

27


సీ.

పాపటబొట్టు చొప్పడు సూర్యచంద్రులు
        నొప్పుమీరు తురాయి కొప్పుబిల్ల
నవరత్నములకుచ్చు బవిరెలు మురువులు
        [1]ముత్యాలకమ్మలు ముక్కఱయును
గంటగరుల్ ముద్దుకంటెయుఁ దాళియు
        నొఱపైన కుతికంటు నుత్తరిగలు
దండలు మరి పత్తికాయ తాయెతలును
        [2]ముత్యాలగాజులు మొగ్గగాజు


తే.

లలరు కెంపులగాజులు తళుకుగాజు
లల్ల నులిగాజులును దగు హస్తకడియ
ములును జేకట్లు చేసరంబులును మఱియు
లలితముగ మించు హస్తపల్లవము లమరు.

28


సీ.

పంచరత్నంబుల బటు వుంగరంబులు
        నొనరఁ బచ్చలచిల్కయుంగరములు
మురువుమీరినయట్టి ముద్దుటుంగరములు
        రంగైన శింగాణియుంగరములు
రహిమించునట్టి వజ్రాలయొడ్డాణంబు
        యల్లికమొలతాడు నందమయిన
గంటల మొలనూలు కడువిం(త బంగరు)
        (వన్నెల)నూళ్ళును వన్నెగలుగు


తే.

కాళ్లకడియంబు లందియల్ గజ్జియలును
పొడగ(మ్ములు) మెట్టెలు పాదసరులు

  1. ముత్తెల
  2. ముత్తెల