పుట:మధుర గీతికలు.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


"సందియం బేల ? ఈగుహయందె యతడు
జొచ్చి తలదాఁచుకొని యుండవచ్చు నిజము”
అనుచు వచియించె నొక్కఁడు; “అట్లు కాదు
ఇందు లేఁ డని నే వచియింపఁ గలను.

సఖుఁడ! అల్లదె చూడుమా సాలెగూఁడు
అల్లిబిల్లిగ ద్వారంబు నల్లికొనియె;
వచ్చి రాకొమరుం డిందుఁ జొచ్చెనేని
చెక్కుచెదరక నిలుచునే చెలఁదిగూఁడు ?"

అనుచు నీరీతి రెండవయతఁడు పలికె;
“సర్పములు క్రూరమృగములు సంచరించు
నిందు జొర నేల ? చావంగ నేల ?” యంచు
వారు వెడలిరి వచ్చినదారిఁ బట్టి.

'బ్రతుకు జీవుఁడ' యంచు నీవలికి వచ్చి,
రాజసుతుఁ డంత తనయంతరంగమందు
నిట్లు తలపోసె 'అక్కటా! యింతదనుక
అల్పజంతువులను నింద సల్పినాఁడ.

5