పుట:మధుర గీతికలు.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాంఘిక, సాంస్కృతికరంగములలో నన్నపార్యుని నాటినుండి మకుటాయమానముగా ఖ్యాతిచెందిన రాజమహేంద్రవర పునర్నిర్మాతలతో శ్రీకందుకూరి వీరేశలింగము పంతులుగారి తర్వాత వారి సహచరులుగా, వారి కుడిభుజముగా వ్యవహరించి, ఆద్యతన కాలమునందు ఆ నగరచరిత్రకు తేజస్సు నాపాదించి ఆ నగరీమ తల్లికి యశోవిభూషణముగా చెవ్నొందినమాన్యులు, మధురకవి శ్రీనాళము కృష్ణారావుగారి శతజయంతి జరిపి, కల్మాష్మితమైన నేటిదేశపరిస్థితులలో మఱల ఆత్యాగశీలియొక్క పవిత్రమైనవాణిని వినిపించి, ఉద్దేశరహితముగ, నియమనిరహితముగా? లక్ష్యరహితముగా. దురాదర్శ పూరితముగా, దౌర్జన్యముగా విచ్చలవిడిగా దురాగతములు సల్పుచు, భరతమాత యొక్క బంగారు భవిష్యత్తును పాడుచేయుచున్న నేటి బాలబాలికలకు, ఆబాలురకవియూ కాంచిన బంగారు భవిష్యత్త్యుభోదయ స్వప్నరూపమైన జిలిబిలి పలుకు తేనియలవాకలైన మధురగీతికా కావ్యశుభసందేశమును ప్రచారము చేయుటకై శ్రీమధురకవి నాళము కృష్ణారాపుగారి శతజయంతి జరుప నిశ్చయించితిమి.

___________