పుట:మధుర గీతికలు.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజ్ఞప్తి

మధురకవి నాళము కృష్ణారాపుగారు బహుముఖ ప్రజ్ఞాశాలియైన మహాపురుషుడు? ఆకాలమునాటికి ఆంధ్రదేశమున అవసరమైన అన్ని సేవారంగముల యందును అంతరాత్మ ప్రేరణతో, చిత్తశుద్దిగా, నిష్కామముగా, నిస్స్వార్ధముగా సేవచేసి, ఆంధ్రమాత ఋణమును తీర్చిన ఆకలంక సేవాశీలి! తాను నమ్మినమంచి సిద్ధాంతములకు తన్ను. తనజీవితమును అంకితము చేయుటయే కాక ఆసిద్ధాంతములను ఆచరించుటలో ఎన్నికష్టములు వచ్చినా, వెనుదీయని పరమ సాహసియైన నిష్కళంక కర్మవీరుడు? సత్యాగ్రహోద్యమము నందేమి? మహిళాభ్యుదయమును సాధించు సేవాకార్యక్రమముల యందేమి? గౌతమీ గ్రంథాలయ నిర్వహణమునందేమి? సంఘసంస్కారమునందేమి? బాలలకవిగా నేమి? నిజాయితీగల సేవాశీలముతో ముందు కుఱికి, పట్టుదలతో, దీక్షతో ఎంతో శ్రమించి, విజయము సాధించిన అఖండ దేశభక్తుడు? భాషాతపస్వి? కడసారి ఊపిరి తీయువఱకు, తాను నమ్మిన ఏకేశ్వరోపాసనా పరమైన మనోభావములు కల్గిన నిర్మలాధ్యత్మిక పరతంత్రుడు?

అట్టి మహానీయుడు పుడమిపై జన్మగైకొని నూరు సంవత్సరములు నిండిపోయినవి. ఆ మహాపురుషుడు ఆంధ్రమాతకేకాదు భారతమాతకే కడుప్రియముగూర్చు పుత్రరత్నము! ముఖ్యముగా ఆంధ్రదేశమునకు, ఆంధ్రవాజ్మయమునకు ఆయన కావించిన అకల్మష సేవాసపర్యలు అహరమైనవి!