Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/557

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మేరుశైలంబుతో మేలమాడెడిమేని, [1]మెఱుఁగుల మిఱుమిట్లు గిఱిగొనంగ
నడు మొకింత వంచి మెడయు సంకోచించి, నెగసెఁ దోన గిరులు నెగసి వెంటఁ
దగిలి పఱవ నభ్రతటినీజలంబులు, గలఁగి దిశలఁ గడచి కడలు కొనఁగ.

1605


చ.

సరసిజనాభముక్త మగుచక్రముకైవడి దుర్నిరీక్ష్యుఁ డై
[2]సరభసవృత్తి గంధవహుచాడ్పున నేఁగుచుఁ గాంచె మేదినీ
ధరములుఁ గాననంబులు నగరంబులుఁ బుణ్యనదుల్ మహాసరో
వరములు నూళ్లుఁ [3]బల్లెలును వాసికి నెక్కిన దేవభూములున్.

1606


క.

అట వేగరు లగువారలు, పటురయమున నేఁగుదెంచి పంక్తిముఖున క
చ్చటిరాముకార్యగతు లు, త్కటమున నెఱిఁగించి రతఁడు తల్లడ మందన్.

1607


క.

విని యాచారులఁ బోవం, బనిచి విచారించి విగతపరిచారుం డై
చనుదెంచెఁ జంద్రహాసము, గొని యల్లన కాలనేమిగృహమున కంతన్.

1608


ఆ.

అర్ధరాత్రిసమయ మగుట నచ్చో నున్న, కాంత లెల్ల నతనిఁ గాంచి కాలుఁ
డరుగుదెంచె ననుచు నంతంత నడఁగంగ, నెఱుఁగనట్లు పోలె నిల్లు చొరఁగ.

1609


చ.

వినయముతో నెదుర్కొని ప్రవీణతమైఁ దగఁ గాలనేమి యా
దనుజకులాగ్రగణ్యునకుఁ దద్దయుఁ బెంపున నర్ఘ్యపాదముల్
మన మలరంగ నిచ్చియు సమాదరణంబునఁ గేలు మోడ్చి యి
ట్లనియెఁ దదీయమానసమునందుఁ గుతూహల ముప్పతిల్లఁగన్.

1610


క.

నడురేయిఁ బిలువఁ బంపక, కడుకొని నీ వరుగుదెంచుకత మెయ్యది యేఁ
దడయక చేసెద నోపిన, నెడపక నీరాక నాకు నెఱిఁగింపు తగన్.

1611


వ.

అనిన దశముఖుం డతని కి ట్లనియె.

1612


చ.

అనుజుఁడు నాదుశక్తిఁ దెగరటాఱినచో బ్రతికింపఁ బూని నేఁ
డనిలజుచేత రాముఁడు మహౌషధశైలము దేరఁ బంపినం
జనియెడు నాతఁ డిప్పుడు సరసంభ్రముఁ డై వడి వాని నీవు చం
పిన నది మేలు వైరిగణభీషణబాహుబలంబు చొప్పడన్.

1613


క.

ఏవెంట నయిన విఘ్నము, గావింపుము భానుఁ డుదయగతుఁ డగునేనిన్
జీవింపఁడు విమతుం డది, గావున నాకోర్కి దీర్పఁ గాఁ దలకొనుమా.

1614


సీ.

ఆద్రోణగిరిక్రేవ నడవిలో నొకసరో, వరము దేవాసురవిరచితంబు
గల [4]దందులో మహోగ్రగ్రాహి యది యుండి, వడిమ్రింగు వనగజావలులనయిన
దానికి వెఱచు సుత్రాముండు నీశుండు, నైనను నరయ వనాటుఁ డెంత
మసలక యాహనుమంతు నాకొలనిలోఁ, జొచ్చునట్లుగఁ జేయు సురుచిరముగ
నీవు దప్ప నాకు నీవేళ నెవ్వఁడు, తెఱఁగుతోడఁ గోర్కి దీర్చువాఁడు

  1. మెఱుఁగులకుప్పలు గిఱిగొనంగ
  2. సరభస మైనయాకసముచాడ్పున
  3. బట్నములు
  4. దందులో మహాగ్రాహి మకరి యుండు, నది మ్రింగు వనగజహరుల నైన