Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/542

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దొరఁగెన్ మిన్నక జంబుకవ్రజములుం దోడ్తోన వాపోయె ని
ష్ఠురభంగిం బడియెన్ మహోల్కలు పరిక్షోభంబుగా గాలియుం
బరుషప్రక్రియ వీచె శర్కరిల మై ప్రత్యంతదేశంబునన్.

1485


వ.

అంత నిశాచరచక్రంబు కార్చిచ్చు కాననంబునకుం గవియుకరణిఁ గపినికాయం
బునకుం గవిసి యరవాయిగొనక కరవాలంబుల ఖండించి గదలఁ జరిపి మున
లంబుల విసరివైచి కూల్చి యత్తలంబులు నెత్తి వియత్తలంబునకుఁ బోఁ జిమ్ము
చు ముద్గరంబుల మొగ్గరంబులు విరియఁ దట్టుచుఁ బంతంబు లొదవఁ గుంతం
బులఁ బొడుచుచు నంకుశంబులఁ గొంకుగొనక నొప్పించుచుఁ దోమరంబుల భీ
మరంధ్రంబులు సేయుచుఁ బట్టిసంబులు గిట్టి పట్టి సమయించుచుఁ గఠారంబులఁ గ
ఠోరంబుగా గ్రుచ్చుచుఁ గుఠారంబుల హఠారంభంబుగా నఱకుచుఁ బరిఘంబులఁ
బరిఘట్టనంబు సేయుచుఁ [1]దలపాటు గలంపక తలపాటు సేయ వనచరులునుం దల
పడి సాలంబులు వైచియు రసాలంబులు గురిసియుఁ దాలంబులు పఱసియు హిం
తాలంబులు వేసియుం గుద్దాలంబులు నిగిడించియుఁ దమాలంబుల నొప్పించి
యుఁ గృతమాలంబుల స్రుక్కించియు నసనంబుల నసము దింపక మోఁదియు
ఖదిరంబులఁ జఠరంబులుగా గొట్టియు వక్షంబుల వక్షంబులు నొగిలించియుఁ
బర్వతంబుల గర్వతంత్రంబులు మాన్పియు నుపలంబుల నుపలంఘనంబులు దప్పిం
చియుఁ దలప్రహారంబులఁ దలలు పగిలించియు [2]విజృంభించునవసరంబున.

1486


శా.

ముల్లోకంబుల కెల్లనాఁ డెడందలో ము ల్లైనపౌలస్త్యుఁడున్
భల్లంబుల్ వడి వెల్లిగొల్పి సమరప్రారంభవేల్లద్ధను
ర్వల్లీజ్యాఘనసారమేదురనభోరంధ్రంబుగాఁ గీశులున్
భల్లానీకము నొల్లఁబోవ శరసంపల్లంపటాస్ఫోటుఁ డై.

1487


తే.

అడరి యొక్కొక్కనిశితసాయకము వఱపి, నిక్కి పెక్కండ్ర నొక్కట నుక్కడంచి
గురుశరంబులఁ గొందఱ గుదులు గ్రుచ్చి, నిమిషమాత్రన కపిసేన నెఱయఁ ద్రుంచె.

1488


క.

తరువులు దునుకలు సేయుచు, గిరివరముల నుగ్గు సేసి కీశబలంబున్
వెరవారఁ బించ మడఁచుచు, శరములు నిగిడించి భువియుఁ జదలును నిండన్.

1489


వ.

గంధమాదనుఁ బంచవిశిఖంబులఁ బ్రత్యేకంబ నలనీలపనసులను దశాశుగంబుల
ద్వివిదు షడస్త్రంబుల వినతు సప్తసాయకంబుల మైందుఁ బంచమార్గణంబుల
గజుని సప్తరోపంబులఁ గుముదునిం బంచపృషత్కంబుల శరభుని బంచాశత్ప్రద
రంబులం దారక్రతుల నేకైకకలంబంబున నంగదునిఁ బదిబాణంబుల నాంజనే

  1. నున్నం దలపాటు దప్పక తలపాటు చేయువానరులును
  2. దంతంబుల ముష్టిఘాతంబులఁ బాదంబుల నాలంబుల దైత్యసమూహంబుల నొప్పించి విజృంభించు