Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/527

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బున సూతుశిరంబు డొల్ల నేసి సింహనాదంబు సెలంగించిన నవ్వీరుండు పొలి
వోనివిక్రమంబున నాక్రమించి తాన సారథ్యంబునుం బ్రవర్తించుచు నుల్కాస
మానంబు లైనశరంబులు కోపంబున నతనిమేనఁ గీలుకొల్పిన నమ్మేటిమగం
డు గండుమిగిలి ఘోరనారాచధారాసారంబులు గాఢంబుగా నో నేసిన వాఁడు
సొమ్మసిల్లి యంతన తెలిసి యాత్మగతంబున.

1361


చ.

హరి ననలుం గృతాంతు దనుజాధిపు నవ్వరుణున్ సమీరుఁ గి
న్నరవరు నీశ్వరున్ బహురణంబుల గెల్చితి నోట లేక యి
న్నరుఁ డిటు నన్ను నొంచెడు ఘనంబుగఁ దూపులఁ గాల మెవ్వరుం
దిరుగఁగఁ బెట్ట లేరు విధిత్రిప్పులు [1]దప్పి చనంగ నేర్చునే.

1362


ఆ.

అనుచు నాత్మలోన నచ్చెరు వందుచుఁ దనబలావసానమునకు వగచి
నిగుడుకోపమునను నిట్టూర్పు లెగయఁగ, నెఱఁకు లాడ నేసె మఱియు నతఁడు.

1363


సీ.

కడువాఁడితూపులఁ గడఁగి విభీషణు, ఘనలలాటస్థలి గాఁడ నేసి
నిశితాగ్ర మై యున్నవిశిఖంబు గొని రాజ, పుత్రునురం బుచ్చి పోవ నేసి
నెఱిమూఁట మూఁటఁ గ్రమ్మఱ వారి నొంచి వా, తూలనందను నటు తూలఁ జేసి
నింగియుఁ బుడమియు నిశితాస్త్రముల నించి, యేదిక్కుఁ దానయై యెదురు లేక
ప్రల్లదంబున బ్రహ్మాండభాండ మెల్లఁ, బగుల నార్చిన దశకంఠుపట్టి వక్ష
[2]మేనుదూపుల లక్ష్మణుఁ డెగువ నేసె, సోలి యాలోన తెలివొంది శూరవరుఁడు.

1364


క.

నాగాస్త్ర మింద్రజిత్తు ప్రయోగింప నుదగ్రవిక్రమోద్ధతశత్రు
ప్రాగల్భ్యము సైరింపక, సాగరగంభీరఘోష సమనాదుం డై.

1365


ఉ.

కాలవిలోలదీర్ఘతరకాయము లై విగళన్మహావిష
జ్వాలలతోడి ధూమములు వావిరి దిక్కుల నెల్లఁ బర్వఁగా
నాలుక లోలిఁ గ్రోయుచు ఘనస్ఫుటనిశ్శ్వసితానలంబులం
దూలిచె దేవయానములఁ దోరము లైనభుజంగసంఘముల్.

1366


క.

గరుడాస్త్ర మంత నురవడి, నరనాయకతనయుఁ డేసె నానాస్త్రమహా
స్ఫురణంబు దూలి పోవఁగ, దరహసితము మోముదమ్మిఁ దళుకొ త్తంగన్.

1367


సీ.

పక్షవిక్షేపజపవనవేగంబున, విఱిగి వృక్షంబులు వెనుకఁ దూలఁ
దోయధిసలిలంబు పాయ యిచ్చినయంత, ఫణిరాజలోకంబు బయలుపడఁగ
గ్రహమండలముఁ దారకాచక్రమును దమ, గతి దప్పి విభ్రాంతిఁ గలఁగి పఱవఁ
దునుక లై చెదరిన తోయదంబులతోన, దివిజయానంబులు దిరుగువడఁగ
ఖరము లగుమహానఖరముల ముక్కులఁ
జీరి పొడిచి బిట్టు చించి త్రుంచి
యక్కజంబు గాఁగ నహిసమూహము నెల్ల

  1. ద్రిప్పఁగ నేరవచ్చునే
  2. మైదుతూపుల లక్ష్మణుఁ డగలఁజేయ, సోలి