వానరులు లంకఁ గాల్చుట
| క. | ఏపునఁ గొఱవులు గొని లం, కాపురగోపురము లెల్ల కపులుం గోపా | 1129 |
| క. | తలుపులు తుత్తునియలుగా, బలువిడిఁ బడఁదాఁటి చొచ్చి పటువేగమునం | 1130 |
| చ. | అదటునఁ గోట సొచ్చి కపు లార్చుచుఁ జిచ్చులు వైచి రెల్లచో | 1131 |
| క. | పొగులుచు మిడుఁగుఱు లెగయఁగఁ, బొగలు నభోంతరము నిండ భూరిజ్వాలల్ | 1132 |
| ఉ. | ఇంక బలీముఖుల్ బలసి రెక్కడిరావణుఁ డేటిలంక పొం | 1133 |
| ఉ. | [1]శ్రీనుతమూర్తి యైనరఘుశేఖరుతేజముఁబోలెఁ బర్వుచున్ | 1134 |
| మ. | పొగ లెచ్చో నెగయుం గృశానుఁ డచటన్ భూమార్చి యై మండు మా | 1135 |
| క. | వితతాగ్నిఁ గరఁగి పిండీ, కృతము లయినచారుకనకగేహంబులు వి | 1136 |
| మ. | కనదభ్రంకషతుంగసౌధములపైఁ గాంతాసమేతంబుగాఁ | 1137 |
| సీ. | ప్రళయకాలమునాఁడు బలువేది మేరువు, బహుభంగి వ్రక్క లై పడియెనొక్కొ | |