Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/464

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


య్యెక్కుడువీరు లాహవమహీస్థలి శత్రులచేత నీగతిం
జిక్కుట చూచియుం జలము సేసెద వింతకు మున్ను వారిలో
నొక్కరుఁ డైన వీరిగతి యూథపుఁ డీల్గినవాఁడు గల్గెనే.

775


ఆ.

వెర వెఱింగి కార్తవీర్యునితోఁ గార్య, సిద్ధికొఱకు సంధిఁ జేసికొనవె
పరశుజితసహస్ర[1]బాహు రాముని మీఱు, రాముఁ డేల తగఁడు సామమునకు.

776


ఉ.

ఎట్టు ఘటిల్లు సంధి గడునె గ్గొనరించిననన్ను నేల చే
పట్టు నతండు నా వలదు ప్రాంజలి యై తనుఁ గన్నమీఁద ని
ట్ట ట్టనువాఁడు గాఁడు శరణాగతవత్సలుఁ డమ్మహాత్ముతోఁ
బుట్టువు లక్ష్మణుండు దలఁపోయ గుణాఢ్యుఁడు మీఱఁ డన్నకున్.

777


క.

సింధురరథఘోటకభట, బంధురబలతతులు సుతులు బంధులుఁ దెగినన్
సంధికి రిపు లొల్లరు దశ, కంధర పద నిదియె సంధికార్యంబునకున్.

778


క.

ఎన్నివిధంబుల నైనం, దన్న కదా కావవలయుఁ దాఁ గల్గినమీఁ
ద న్నిఖలము గల దని హిత, వు న్నీతియుఁ దగవు భయము పుట్టఁగఁ జెప్పెన్.

779


వ.

ఇ ట్లనేకప్రకారంబుల నమ్మయుతనయ చెప్పిననయనిష్ఠురోక్తులు మనసునం బెట్టక
నిట్టూర్పు నిగిడించి కొండొకసేపు విచారించి రావణుండు.

780


ఉ.

నీవు హితోక్తు లీపగిది నీతిపథంబునఁ బెక్కు చెప్పి తా
త్రోవకు నేగతిన్ మనసు దూఱదు మున్ను సురాసురాదులం
జేవ లడంచి లావునఁ బ్రసిద్ధికి నెక్కిన నేను లోకపా
లావలి నవ్వ నవ్వనచరాశ్రితు నేగతిఁ గాంతు మానవున్.

781


ఉ.

[2]తోలితి నింద్రు నగ్ని యము దుష్టనిశాచరు నబ్ధినాథునిన్
గాలిఁ గుబేరుఁ డత్సఖు నఖండబలంబులఁ ద్రుంచి మించి నే
వాలితి నేల యేలితి ధ్రువంబుగ నేఁబదిలక్షలేండ్లు నేఁ
డాలము వచ్చినం గడఁగి యంగన నిచ్చిన నన్ను నవ్వరే.

782


చ.

ఎఱిఁగి యెఱింగి ము న్నతఁడె యె గ్గొనరించెను దానికై కదా
చెఱగొనివచ్చితిం బిదప సీత వృథాకథ లింక నేల పెం
పఱు బ్రదు కింత తీయనె ఖరాదులచావున కేమి చింత నీ
మఱఁదలిబన్న మేపగిది మానిని యీఁగుదు సంధి చేసినన్.

783


క.

రామున కే మ్రొక్కిన సు, త్రామాదులు నాకు వెఱతురా యిం కిట నీ
వేమియుఁ జింతింపకు సం, గ్రామం బొనరింతు నృపులఁ గపులం ద్రుంతున్.

784


తే.

చెలువ నీతనూభవు నింద్రజిత్తుఁ జెనయు, వాఁడు మూఁడులోకములందు లేఁడు నాకు
నింతవిలుకాఁడు గలుగంగ నంతరాదు, తలఁక వల దని దేవి లోపలికి ననిచి.

785


వ.

అనంతరంబ దశాననుండు చింతాకులమానసుం డగుచుఁ గొండొక విచారించి

  1. బాహుని మీఱినరాముఁడు
  2. ఈపద్యము కొన్నిప్రతులం గానిపించెడిని.