పుట:భాస్కరరామాయణము.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అనుచు దశరథుండు విజయుండును ఘృష్టియు మంత్రపాలుండును సిద్ధార్థుండును
రాష్ట్రసాధకుండు నశోకుండును జయంతుండును సుమంత్రుండును నను నెన
మండ్రు మంత్రులం బిలిపించి యందు సుమంత్రుం గనుంగొని.

42


తే.

మనపురోహితు లగుచున్న మహితమతుల, ఘను వసిష్ఠుని వామదేవుని సుయజ్ఞు
ననఘు జాబాలిఁ గశ్యపు మునుల మఱియుఁ, దగినవారినిఁ గొని సమ్మదమునఁ దెమ్ము.

43


వ.

నా విని సుమంత్రుండు నేఁగి ప్రియ మెసంగం బిలిచి యమ్మునులం దోడ్కొని
[1]వచ్చిన.

44


క.

జనపతి వారల నుచితా, సనములఁ బెం పెనయ నునిచి సమ్మద మొందన్
[2]గొనకొని పూజించి నయం, [3]బెనయంగా మ్రొక్కి వారి కి ట్లని పలికెన్.

45


క.

సుతులు మును నాకు లేమిని, మతి నెంతయు వసటఁ బొంది మత్కులహితులన్
సుతులఁ గన నశ్వమేధము, చతురతఁ జేయంగఁ గోరి సమ్మతి మిమ్మున్.

46


మ.

ఇటు రప్పించితి నాదుయాగము మనం బింపారఁ జేయింపుఁ డా
దట నన్నన్ ముద మంది యామునిపతుల్ ధాత్రీశ పెం పొంద నీ
విటు లూహించినబుద్ధి లెస్స తగ నీయిష్టం[4]బ పుష్టంబు గా
ఘటియింపం గల దధ్వరోద్యమము వే కావింపు మిం కీ వనన్.

47


దశరథుండును మనోరథసంతోషభరితుం డయి మంత్రుల నాలోకించి.

48


సీ.

ఒనరంగ సరయువునుత్తరతీరంబు, నను యజ్ఞవాట మొనర్పుఁ డోలి
[5]సంభారువులు దెండు శాంతులు సేయింపుఁ, డధ్వరవైకల్య మరయుచుండు
బ్రహ్మరాక్షసకోటి క్రతువిఘ్న మైనప్డథ, క్రతుకర్త చెడిపోవుఁ గాన క్రతువు
గురువులయానతిఁ బరిపూర్తి వొందఁగా, విధ్యుక్తగతిఁ జేసి వెలయవలయు


మంత్రకోవిదులార సమర్థు లగుచు, మానితాశ్వము విడువుఁ డేమఱక యుండుఁ
డశ్వమేధము సేసి యన్వయము పరఁగఁ, దగినపుత్రులఁ గాంచెద ధర్మ మెసఁగ.

49


వ.

అని పలికి యమ్మునుల మంత్రుల వీడు కొల్పి యంతఃపురంబున కరిగి యభిమతం
బెసంగ.

50


చ.

తన ప్రియపత్నులం గడుముదంబునఁ గన్గొని కాంతలార యేఁ
దనయులఁ గాంచఁ గోరి యుచితం బగు నేమముతోడ నధ్వరం
బొనరఁగఁ జేయుచుండెద శుభోన్నతి మీరును దీక్షఁ గైకొనుం
డనవుడు సంతసిల్లిరి ముఖాంబుజముల్ వికసిల్ల నత్తఱిన్.

51


సీ.

ఏకాంతమున సూతుఁ డి ట్లను దశరథుఁ, గనుఁగొని భూమీశ కశ్యపునకుఁ
దగ విభండకముని తనయుఁడై పుట్టెడి, నమ్మునీశ్వరునకు ననఘమూర్తి
చిరపుణ్యుఁ డగుఋశ్యశృంగుఁడు పుట్టెడు, రోమపాదుం డనుభూమివిభుఁడు

  1. వచ్చి ముందటం దెచ్చిన
  2. గనుకనిఁ బూజించి
  3. బెనయఁగ మధురోక్తి వారి
  4. బదృష్టంబు సంఘటి
  5. సంభారములు