పుట:భాస్కరరామాయణము.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అనుజుఁడు జటాయువునకుం, దనరఁగ ధర్మోదకములు తద్దయు నాప్యా
యనముగ నిడవలె నాకును, వనచరులార కొనిపొండు వారిధికడకున్.

724

సంపాతి కపులతో నిజవృత్తాంతముం జెప్పుట

వ.

అని పలుకఁ గపులు సంపాతిని సముద్రతీరంబునకుం గొనిపోయిన నతండు కృ
తస్నానుం డై జటాయువునకుఁ దిలోదకదానం బాచరించినవెనుకఁ గ్రమ్మఱం
గొనివచ్చి యాసీనుం జేసిన సంపాతి సకలవానరులు హర్షింప నిట్లనియె వినుం
డేకచిత్తంబున నావృత్తాంతం బంతయు దక్షిణసముద్రతీరంబున నున్నవింధ్యప
ర్వతాగ్రంబున నిశాకరుం డనుమునివరేణ్యుం డెనిమిదివేలేం డ్లత్యుగ్రతపం బా
చరింప నేనును జటాయువు నమ్మునీంద్రునాశ్రమంబున వసియించితిమి.

725


క.

పూవనికావనితరువులు, లే వమ్మునియాశ్రమమున లీలన్ నవపు
ష్పావళులఁ బొలసి కమ్మని, తావులు వెదచల్లు మారుతము [1]ప్రసరింపన్.

726


క.

సురలోకమ్మున కమ్ముని, వరుఁ డిచ్ఛం జన్న వెనుక వడి వా దై మ
చ్చరమున నేను జటాయువు, సరభసమున వేగ యాకసంబున కెగయన్.

727


క.

ఇనరశ్ములవేఁడిమి నా, ఘనతరపక్షములు గమరి కడుఁ దూలి రయం
బున వింధ్యశిఖరిపైఁ బడి, దినషట్కముదాఁక మూర్ఛ దేఱక యుంటిన్.

728


వ.

మఱి మెల్లన లబ్ధసంజ్ఞుండ నై దిక్కులు చూడ నదులు గిరులు వనంబులు సము
ద్రంబులు గానక మఱికొంతగడువునకు వింధ్యం బని యెఱింగి ముని చన్న వెను
క నమ్మునియాశ్రమంబున మున్నూఱేం డ్లుండియు మునిం గాననిదుఃఖంబునం బొ
గులుచు నాపర్వతంబు డిగ్గి దర్భకంటకపరీతం బైనపుడమి నతిదుఃఖంబునం జ
రించుచు మునీశ్వరు వెదకంబోయి యొక్కవృక్షమూలంబున నుండి దూరంబున
భానుప్రభాభాసురుండును గృతాభిషేకుండు నుదఙ్ముఖుండును నై వచ్చుచున్న
మునీంద్రుం గని సంతసంబున నటఁ జూడ.

729


మ.

[2]పరఁగన్ లేఁగలు గోవువెంట మరులింపం బోవుభంగిన్ మునీ
శ్వరుఁ డాత్మాశ్రమ మొందఁ బోయెడునెడన్ వారింపఁ బో కెప్పుడుం
గరిసింహాదిమృగంబు [3]లెల్ల నెడఁదాకన్ వెన్నడిం బోయి మం
దిర మమ్మౌని చొరంగ వే మగిడి యర్థిం బోవు మేపుల్ గొనన్.

730


వ.

అట్టియెడ నేనుం బోయి వాకిట నుండ.

731


క.

పక్షములు లేనినన్ను ని, రీక్షించియు నెఱుఁగలేక యేమియు నాతో
దక్షతఁ బలుకక తనగృహ, మక్షీణాసక్తిఁ [4]జొచ్చి యాదర మొదవన్.

732


వ.

క్షణమాత్రం బుండి మగుడ నేతెంచి క్రమ్మఱ నన్నుం జూచి యమ్ముని యి
ట్లనియె.

733
  1. మధురింపన్
  2. పరఁగం బ్రాణము తల్లివెంట మధురింపం బోవు
  3. లాలయముదాఁకం
  4. జొచ్చె నాసమయమునన్.
     వ. ఇట్లు క్షణమాత్రం బుండి వెడల నేతెంచి