పుట:భాస్కరరామాయణము.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జటాయువు రావణునితోఁ బోరి నేలం గూలుట

చ.

కదిసి దశాస్య యేఁ గలుగఁగా రఘువీరునిదేవి నెట్లు నీ
కదయతఁ గొంచు నేఁగ వశ మంచు రథంబున కడ్డ మేఁగి యో
రి దనుజ సీత డించి సుచరిత్రతఁ బ్రాణముఁ గాచికొమ్ము కా
కది యిది యాడితేని నుఱుమాడుదుఁ గండలు రాల్తు మేదినిన్.

119


క.

ఓరి నిశాచర త్రిభువన, వీరుం డగు రాముదేవి విడువుము దనుజ
శ్రీ రాజిల్లఁగ బ్రదుకుము, కోరుదురే వెడఁగ కాలకూటము గ్రోలన్.

120


చ.

అఱుగునె యుక్కుగుండు కడు సంగద మ్రింగిన నూఁచి చూచినన్
విఱుగునె మేరుభూధరము వెంగలి వై రఘురాముభామినిం
జెఱగొని పోవఁ జూచెదవు చెచ్చెర నిప్పుడ యోరి నీచ నా
కఱపినబుద్ధిఁ గైకొనుము కాచెద జానకి డింపు మిమ్మహిన్.

121


క.

అని పలుదెఱఁగులఁ జెప్పఁగ, దనుజుఁడు గైకొనక యరుగఁ దలఁచి [1]కదలినన్
వినువీథి కెగసి మార్కొని, వెనుఁబడ నందంద బిట్టు వ్రేయుచుఁ గడిమిన్.

123


స్రగ్ధర.

చండాతిక్రోధదృష్టుల్ చదలఁ [2]బొదల భాస్వద్దశాస్యాంగసంధుల్
ఖండించుం జించు నొంచున్ [3]ఖరచరణనఖాగ్రంబులం బోఁజుఁ దే రు
ద్దండాటోపంబునన్ భూస్థలిఁ బడ నడుచున్ దంగడిం ద్రిప్పు నుద్య
త్సండీనోడ్డీనవృత్తిం ద్వరితగతి సముత్సాహసంరంభలీలన్.

124


క.

పెనుగాలిఁ దూలు మేఘం, బునుబోలెను బక్షివిభుని భూరిబలమునం
దన కెట్లు నరుగరా క, ద్దనుజురథము [4]దిరిగె నీఱతాఱల నడలన్.


సీ.

ప్రకటితోద్ధతి డాసి మకుటముల్ విఱిచిన, జల్లున రత్నసంచయము దొరఁగ
బెగడొంద నందంద మొగములు వ్రేసిన, భుగభుగ మని రక్తపూర మొలుక
రథ మాక్రమించి ఘోరంబుగా వీచిన, జిఱజిఱం దిరిగి పె ల్లొఱఁగఁ బడఁగ
సరభసంబుగ సితచ్ఛత్రధ్వజాదులు, విఱిచినఁ బెళపెళ విఱిగి కూలఁ
జాల సుడివడి దనుజుఁ డా[5]భీలరౌద్ర, భంగిఁ బదివిండ్లు నెత్తి యఃప్పక్షివిభుని
సూడుకొనఁజేసి తిరిగి వే ఱొక్క[6]దిక్కు, తెరువుగా సూడఁజూచిన నరుగనీక.

125


చ.

వెనుకొని పాఱుఁ బాఱి నడివీఁపు మహోగ్రతఁ దన్నుఁ దన్ని మా
ర్కొని వడి నొంచు నొంచి యిటకున్ దివికిం జన నిచ్చు నిచ్చి యే
నని వెస నార్చు నార్చి వెగ డందఁగ దందడిఁ జేరి దుర్దశా
వినిహతు నద్దశాసనుని వ్రేయు జటాయువు పేర్చి వెండియున్.

126
  1. 'కడఁగినన్, ఘన మైన కోపవహ్నియు, వెనుఁబడ' అ. ప్ర.
  2. 'బొదలఁగా స్వాంసంధుల్ దెగంగా' అ. ప్ర.
  3. 'ఖరనఖరములన్ గాత్రముం జోన్సు దేరు' అ. ప్ర.
  4. విఱిగె వీటతాటన మగుచున్.
  5. భీలభంగిఁ, బదికరంబుల విం డ్లెత్తి పక్షివిభుని
  6. 'జాడ, నరుగఁ జూచిన రాక్షసు నరుగ నీక' వ్రా. ప్ర.