పుట:భాస్కరరామాయణము.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

నినుఁ గని నప్పటఁగోలెను, దనమది సుడివడఁగ రామధరణీశుఁడు నిన్
గనుఁగొనఁ గోరెడుఁ దడయం, జన దియ్యెడ వదినె వైతి చను మయ్యెడకున్.

149


చ.

అనవుడుఁ బొంగి దానవి రయంబున నయ్యెడ [1]కేఁగుదెంచినం
గనుఁగొని సీత నవ్వుటయుఁ గన్నులఁ గోపము పేర్చి నన్నుఁ గై
కొన కిది నవ్వె నాసవతికకోఱడ మెట్లు సహింతు దీనితో
మను విది యేల యీచెడుగుమానిసి మ్రింగెద నంచు నుగ్రతన్.

150


చ.

[2]కొఱవులభంగి మండు మిడిగ్రుడ్డుల నిప్పులు రాల దీప్తి గ్రి
క్కిఱియ మహోల్క- రోహిణిపయిం బఱతెంచినమాడ్కిఁ జూడ్కికిన్
వెఱపు జనింప సీతపయి వే పఱతేర నృపాలుఁ డొక్కచే
బిఱుసునఁ బట్టె నయ్యబలఁ బెల్కుఱ రాక్షసిఁ బట్టె నొక్కటన్.

151


వ.

ఇ ట్లన్నిశాచరిం బట్టి లక్ష్మణుం గనుంగొని.

152

లక్ష్మణుఁడు కూర్పణఖముక్కుసెవులు గోయుట

క.

క్రూరులు దుష్టాత్ములు నగు, వారలతో నగవు లెపుడు వలవదు కంటే
నేరమి మనదెసఁ గల్గుట, నీరక్కసి జనకతనయ కిమ్మెయిఁ దొడరెన్.

153


వ.

కావున దీని నింక విరూపిం జేయు మనుటయు నాసుమిత్రాపుత్రుండు.

154


క.

ఘోరక్రోధంబున న, వ్వీరోత్తమునాజ్ఞ నొక్కవెస నన్నక్తం
చారిణి నప్పుడ పట్టి కు, ఠారంబున ముక్కుసెవులు డగ్గఱఁ గోయన్.

155


ఉ.

భంగము నొంది యద్దనుజభామిని దిక్కులు మ్రోయ రోఁజుచున్
నింగికి మ్రొగ్గుచున్ నెగసి నీలవలాహికభంగిఁ బాఱి యు
త్తుంగసభాస్థలిన్ ఘనకుతూహలతన్ దనుజాళి గొల్వఁగా
ముంగలఁ బేర్చి యున్న ఖరుముందటఁ గూలి భుజంగిచాడ్పునన్.

156


క.

పొరలుచు నేడ్చినఁ గని య, చ్చెరువును గ్రోధంబుఁ గదుర శీఘ్రగతిన్ వి
స్ఫురదుగ్రభ్రూకుటిభీ, కర మగుబలుమొగముతోడ ఖరుఁ డిట్లనియెన్.

157


ఉ.

ఎవ్వఁడొకో లయాంతకుని నే నని మార్కొని కోఱ మీటె వాఁ
డెవ్వఁడొకో పురాంతకుని యెక్కుడుక న్నఱకాలఁ దన్నెఁ దా
నెవ్వఁడొకో సమిత్రముగ నిప్పుడు చావఁ దలంచె నింతవాఁ

  1. “కేఁగినం గనుం
    గొని మహిజాత నవ్వుటయుఁ గోపము రేఁగ నిదేల నన్నుఁ దాఁ
    గనుఁగొని నవ్వె నాసవతి కావల మెట్లు'. అ. ప్ర.
  2. 151 మొదలుకొని 155 వఱకుఁ గల పాఠమునకు మాఱుగా
    “చ. అవని చలింప నైజవికృతాకృతిఁ గయికొని పేర్చి సీతపైఁ
         గవిసినఁ జేయి మా టిడుచు గ్రమ్మన లక్ష్మణ దీనిఁ బట్టి యం
         గవికలఁ జేయు మన్న నురు గాఢరయంబునఁ గోసె ముక్కునుం
         జెవులును గ్రూర ధార విలశీ పిల్లుకు రారమునం గఠోరతన్." వ్రా. ప్ర.