పుట:భాస్కరరామాయణము.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డతనియందు దోషంబు లేదు మహాపుణ్యంబు సంభవించె మీ రింక వగవకుండుం
డని యారాఘవుల నాశీర్వదించి యమ్మునులు నిజాశ్రమస్థానంబులు కేఁగి సుఖం
బున్నంత.

125

శ్రీరామలక్ష్మణులకడకు శూర్పణఖ వచ్చుట

క.

బోనంబు దెచ్చి యట నిజ, సూనుఁడు దెగి యున్నఁ జూచి శూర్పణఖ వివ
ర్ణానన యై నేలం బడి, హా నందన యనుచు దుఃఖఖితాత్మక యగుచున్.

126


క.

మౌనవ్రతుఁ డై పరమ, ధ్యానంబునఁ దపము సలిపి తండ్రివిరోధిం
బూని జయింపఁదలంచిన, నానందనుఁ డి ట్లగుట మనం బెటు లోర్చున్.

127


వ.

అని చింతించి.

128


చ.

కనదురువిస్ఫులింగములు కన్నుల రాలఁగఁ జుప్పనాతి య
మ్మునిజను లున్నచోటికి సమున్నతి నేఁగియు నమ్మహాత్ములం
గనుఁగొని యున్నరూపు నెఱుఁగన్ వినిపింపుఁడు లేకయున్న మి
మ్మును బరిమార్తు నన్న మునిముఖ్యులు తల్లడ మంది రందఱున్.

129


తే.

అప్పు డొక్కమహాత్ముఁ డి ట్లనియె దానితోడ నో కాంత యిచటి కస్తోకభుజబ
లాఢ్యుఁ డొకరాజు వచ్చి నీయాత్మభవునిఁ, దునిమె నెఱుఁగ మతండు వోయినపథంబు.


క.

ఇక్కరణిఁ జెప్పిన విని, వెక్కసపడి వనమునందు విహరింపఁగ నం
దొక్కదినంబున నక్కడ, నక్కరుణాకరుఁడు సీత యనుజన్ముండున్.

131


వ.

విలాసంబునఁ బర్ణశాలయందు వసియించుచు నమ్మహీకళత్రుండు జనకరాజపు
త్రితో సరససల్లాపంబు లాడుచున్నంత.

132


ఉ.

అత్తఱిఁ బంక్తికంఠుచెలియల్ కఠినాత్మక చుప్పనాక దా
నెత్తినవేడ్క నెచ్చటికి నేనియు [1]నాఁ డటు వోయి పోయి రా
జోత్తము రాముఁ జూచె నసితోత్సలవర్లు వినీలకుంతలుం
జితజసన్నిభున్ నృపతిసింహు మనోహరదీర్ఘలోచనున్.

133


క.

కనుఁగొని యెంతయు మెచ్చుచుఁ, దనివి సనక మఱియుఁ జూచి తద్దయు రాగం
బునఁ దలయూఁచుచు నెద న, య్యనఘునియొప్పునకు [2]విస్మితాత్మిక యగుచున్.

134


సీ.

రేకు లన్నియు విచ్చి రేయెండ జిగి నిండి, కర మొప్పు తెల్లదామరలకంటె
నఱ లేని నెఱదీప్తి మెఱుఁ గెక్కి సరిమింటఁ, జరియించుసంపూర్ణచంద్రుకంటె
నునుఁదీఁగజిగి దోఁగి నునుపారి నిగ్గారి, తనరుదిక్కరులహస్తములకంటె
నిగిడి చేరువ లెల్ల నీలోత్పలద్యుతుల్, పచరించుహరినీలరుచులకంటె
నితనికన్ను లొప్పు నీరాజుమో మొప్పు, నితనికరము లొప్పు నితనిమేని
కాంతి యొప్పు ననుచుఁ గడువేడ్క నన్నిశా, చరిణి చూచె రామచంద్రుఁ దవిలి.

135


ఆ.

చూచి చేర నరిగి సురుచిరాకార నీ, పేరుఁ గులముఁ జెప్పు ప్రియము పుట్టె

  1. నేడ్తెఱఁ బోయి పోయి
  2. 'వలచి యతివిస్మిత యై' అ. ప్ర.