పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


హడ్సన్‌ లాంటి బ్రిటిష్‌ సైనికాధికారి ఆమె ధైర్య సాహసాలను స్వయంగా ప్రశంసించాడు. ఈ మేరకు ఆయన తన సహచర అధికారులకు లేఖల ద్వారా తెలియచేశాడు. మాతృదేశం పట్ల ఆమెకున్న గౌరవం అతడిని అమితంగా ఆకట్టుకుంది. అ ప్రభావంతో ' జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌ ' తో ఆమెను పోల్చుతూ కీర్తించాడు. (భారత్‌ కే స్వాతంత్ర్య సంగ్రామం మే ముస్లిం మహిళా వోంకా యోగదాన్‌, డాక్ల్టర్‌ ఆబిదా సమీయుద్దీన్‌, పేజి.45)

ఆ ఆంగ్లేయాధికారి రాసిన లేఖలలోని హెచ్చరికలను, ఆమె చర్య లను అధికారిక లేఖలలో ఆమె కార్యకలాపాలను వివరించిన తీరు, ఆ సంద ర్భంగా లేఖలో వాడిన భాష తీవ్రతను బట్టిఆకుపచ్చ దుస్తుల. మహిళ గా ఖ్యాతిగాంచిన ఆ యోరాలుధురాలు బ్రిటిTo ష్‌ సైనికాధికారుల గుండెల్లో ఎంతటి గుబులు పుట్టించిందో అర్థం చేసుకోవచ్చు.

ఈ మేరకు అంబాలా సైనిక స్థావరానికి పంపబడిన ఆమె ఆ తరువాత ఏమైందో తెలియరాలేదు. శత్రుదాళాలలో అంతి భయోత్పాతం సృష్టించి ఆంగ్లేయ అధికారులను హడలగొట్టడం కాకుండ కడు జాగ్రత్త సుమా అంటూ పరస్పరం ముందస్తు జాగ్రత్తలు తెలుపుకోవాల్సినంత భయానక పరిస్థితులను బ్రిటిషు సైనిక స్థావరాలలో కల్పించిన ఆ యోధు రాలిని శత్రువు ఏం చేసి ఉంటాడన్న విషయం మనం ఊహించలేనిది ఏమాత్రం కాదు


                                         ***** 


హిందూ- ముస్లింలకు ధర్మం, ఆత్మ గౌరవం, ప్రాణం, ధనం అను నాలుగు అంశాలు ప్రధానం ఈ అంశాలను కేవలం స్వదేశీ పాలకులు మాత్ర ంఏ ప్రసాదించగలరు.కంపెనీ సైనికులు ప్రజలను దోచుకుంటున్నారు. ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్నారు. స్త్రీలమీద అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుపుతున్నారు. హిందూ ముస్లిం పౌరులను హెచ్చరిసస్తున్నాం ఆత్మగౌరవంతో, ధర్మ బద్ధం గా ప్రశాంత. జీవితం సాగించాలంటే స్వదేశీ పాలన కోసం శతృవులకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టండి. స్వదేశీ సైన్యంలో భర్తీకండి...మాతృదేశం కోసం సాగుతున్నపోరాటంలో భాగస్వాములు కండి. శతృవుకు సహకరించకండి. ఆశ్రయం ఇవ్వకండి.

-బేగం హజరత్‌ మహాల్‌

62