పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం ముస్లింమహిళలు



రణతంత్రాన్ని స్పురణకు తెస్తుంది.

బ్రిటిష్‌ స్థావరం మీదదాడి చేసి శత్రుసైనికులతో పోరాడుతూ ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆ గాయం కారణంగా అమె గుర్రం మీదనుండి కింద పడపోయారు. ఆ సమయాన్నిఅదునుగా ఉపయాగించుకుని శత్రువు ఆమెను చుట్టుముట్టి బంధించాడు. అక్కడి నుండి ఆమెను సైనిక స్థావరానికి తరలించాడు. ఆమెను బ్రిటిషు అధికారి లెఫ్టినెంటుహడ్సన్‌ కట్టుదిట్టమైన బందోబస్తుతో అంబాలాలోని బ్రిటిషు సైనిక స్థావరానికి పంపాడు. ఆ సమయంలో అంబాలాలోని ఆంగ్లేయ సైనికాధికారులకు ఆమె గురించి, ఆమె నిర్వహించిన దాడుల గురించి, ఆమె తిరుగుబాటు కార్యకలాపాల వివరాలను, ఆమె ధైర్యసాహసాలను వివరంగా ఎకరువు పెడుతూ, జాగ్రత్తలు చెబుతూ అంబాలా సైనిక స్థావరం డిప్యూీ కమీషనర్‌కు 1857 లై 29న లేఖ రాశాడు. ఆ లేఖలో, నేను మీ వద్దకు ఒక ముస్లిం ముదుసలిని పంపుతున్నాను. ఆమె విచిత్రమైన మహిళ. ఆమె ఆకుపచ్చ దుస్తులు ధరిస్తుంది. కంపెనీ మీద తిరుగుబాటు చేయ మని ప్రజలను రచ్చగొట్టడం ఆమె పని. స్వయంగా ఆయుధాలు చేపట్టి తిరుగుబాటు దారులకు నాయకత్వంవహించి మన స్తావరాల మీద దాడులు చేస్తుంది. పలుమార్లు మన స్థావరాలపై ధర్య సాహసాలతో విరుచుకుపడంది. ఆమె ఆయుధ చేపడతే ఐదాుగురు సాయుధా పురుషులతో పోరాడగల శక్తిమంతురాలని, ఆమె బారిన పడన మన సిపాయిలు, అధికారులు చెబుతున్నారు. ఆమె పట్టుబడిన రోజున, శిక్షణ పొందిన సైనికాధికారిలా నగరంలోని తిరుగుబాటుదారులను కూడేసుకుని, మన స్థావరాల మీద దాడి చేసి పోరాడుతూ పట్టుబడింది. ఆమె కడు ప్రమాదాకారి. జాగ్రత్త సుమా, అని పేర్కొన్నాడు.

ఈ లేఖను ఖుర్షీద్‌ ముస్తఫా రజ్వీప్రాసిన జంగ్-యే-ఆజాది 1857 అను ఉర్దూ గ్రంథంలో ప్రచురించారని, ' భారత్‌ కే స్వాతంత్ర్యసంగ్రామం మే ముస్లిం మహిళా వోంకా యోగదాన్‌ ' గ్రంథ రచయిత్రి డాక్టర్‌ ఆబిదా సమీయుద్దీన్‌ తన గ్రంథంలో (45వ పేజిలో) వివరంగా ఉటంకించారు. ఈ లేఖతో పాటుగా అంబాలాలోని ఇతర ఆంగ్లేయాధికారులకు పలు ముందస్తు హెచ్చరికలు చేస్తూ ఆకుపచ్చ దుస్తుల మహిళను అంబాలలోని బ్రిటిషు సైనిక స్థావరానికి పిష్టమైన బందోబస్తుతో తరలించారు. భారత స్వా తంత్ర్య సంగ్రామ చరిత్రలో అత్యంత క్రూరుడిగానూ, ఇచ్చిన మాట తప్పటంలో ప్రప్రథమునిగా అపఖ్యాతిని మూటగట్టుకున్నఆంగ్లేయాధికారి లెఫ్టినెంట్

61