పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌



ఆ మహాయోధురాలి స్మృతిగా మిగిలి ఉన్న ఆమె సమాధి నిర్లక్ష్యానికి గురికావడం గురించి తెలుసుకున్న ప్రదాని నెహ్రూ తన బాధను వ్యకం చేస్తూ తగిన శ్రద్ద తీసుకుంటానని హమీ ఇచ్చారు. ఆ సమాధిని ఫోటోలు తీయించి, వాయటిని ఆజం ఖదిర్‌కు కూడ పంపారు. ఆ ఫోటోలతోపాటుగా, నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం ఆ సమాధి సంరక్షణ బాధ్యతను తీసుకుంటానని ప్రధాని నెహ్రూ హామీ కూడ ఇచ్చారు. ఆ సంవత్సరం ఉత్తర ప్రదశ్‌లో జరిగిన ప్రదమ స్వాతంత్య్రసంగ్రామం ఉత్సవాలలో ఆ మహాయోధ బేగం హజరత్‌ మహాల్‌ ప్రస్తావన కూడ రాలేదు. ఈ విషయమై ప్రిన్స్‌ ఆజం బారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి పలు ఉత్తరాలు రాయడంతో 1958 మే 9న భారత ప్రభుత్వం లోక్‌సభలో 1857 నాటి పది మంది యోధుల పట్ల ప్రత్యేక గౌరవాన్ని ప్రకటిస్తూ ఆ జాబితాలో బేగం హజరత్‌ మహాల్‌కు ఆగ్రపీఠం వేసింది. ఆ తరువాత ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం అప్పటివరకు లక్నోలో ఉన్న విక్టోరియా పార్కు పేరు మార్చి బేగం హజరత్‌ మహాల్‌ పార్కుగా నామకరణం చేసింది.

52