పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌ సైనిక తుపాకులకు ఎదురొడ్డి నిలచిన వీరవనిత

బేగం అజీజున్‌

(1832 - 1857)

ప్రథామ స్వాతంత్య్ర సంగ్రామంలో రాజులు, రాణులు, సంస్థానాధీశులు, స్వదేశీ సైనికాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వర్గాలు తమ రాజ్యాలను, సంస్థానాలను కాపాడుకోవాలని, అధికారాన్ని చేజారనివ్వరాదన్న బలమైన కోరికతోబ్రిటిష్‌ పాలకుల మీద తిరుగుబాటు చేశారు. ఈ రకమైన కాంక్షలేవీ లేకుండ కేవలం మాతృభూమి మీదగల ప్రేమాభిమానాలతో ప్రాణాలను తృణప్రాయంగా భావించి, నిస్వార్థంగా తిరుగుబాటులో పాల్గొని ప్రాణాలను బలిచ్చిన సామాన్యులు ఉన్నారు. అటువంటి సాధారణ మహిళలలో ఒకరు బేగం అజీజున్‌.

1832లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బితూర్‌లో బేగం అజీజున్‌ జన్మించారు. తండ్రి హసీనా ఖాన్‌. తల్లి హమీదా బాను. చిన్ననాటనే ఆమె అమ్మను కోల్పోయారు. అజీజున్‌ మంచి రూపశి. అందాలరాశి అజీజున్‌ ఆనాటి ప్రసిద్ధ నర్తకి ఉమరావ్‌జాన్‌ బృందంలో చేరారు. మంచి నర్తకిగా ఖ్యాతిగాంచారు. నాట్య కళ మీద మంచి అభినివేశాన్ని సాధించి ఆ కళను ప్రదర్శిస్తూ అపారంగా ధనాన్నిసంపాదించారు. 53