పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం:ముస్లింమహిళలు


ప్రక్కల గల స్వదేశీ పాలకులు, స్వదేశీ యోధులు కంపెనీ పాలకుల దుశ్ఛర్యల పట్ల తీవ్రంగా ప్రభావితులయ్యారు. కుతకుతలాడుతున్నహృదాయాలతో ఆంగ్లేయుల చర్యల పట్ల మండి పడసాగారు. ఆ సమయంలో ప్రదమ స్వాతంత్య్రసంగ్రామం ఆరంభవుంది. కంపెనీ చర్య ల పట్ల తీవ్రంగా ఆగ్రహావేశాలను వ్యకంచేస్తున్న అవద్లోని ప్రజలు, సైనికులు స్వదేశీయుల పాలన కోసం కంపెనీ పాలకుల ఆధిపత్యాన్ని నిరాకరిస్తూ తిరుగుబాటు ప్రకటించారు. 1857 మే 31న లక్నోలోని ఛావనీలో తిరుగుబాటు ఫిరంగులు పేలాయి. ఆంగ్లేయాధికారులను, ఈస్ట్‌ ఇండియా కంపెనీ సమర్థకులను లక్నో నుండి, అవధ్‌ రాజ్యంలోని ఇతర ప్రాంతాల నుండి తరిమివేశారు. అవధ్‌ రాజ్యంలోని అత్యధిక ప్రాంతాలు తిరుగుబాటు వీరుల ఆధిపత్యంలోకి వచ్చాయి. కంపెనీ పాలనాధికారం అనవాళ్ళు కూడ కన్పించకుండ తుడుచుకు పోయింది.

ఆ పరిస్థితులతో హడలిపోయిన ఆంగ్లేయులు బేగంతో కాళ్ళబేరానికి వచ్చారు. ఆమె కనుక కంపెనీకి సైనిక సహాయం అందచేస్తే వాజిద్‌ అలీషా పూర్వీకుడు షుజా ఉద్దౌలా కాలంలో అవథ్‌ పాలన క్రింద ఉన్న అన్ని ప్రాంతాలను తిరిగి ఆమెకు అప్పగిస్తామని, తద్వారా అవధ్‌ రాజ్యం విస్తరించగలదని రాయబారానికి దిగారు. ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే కంపెనీ రాజ్యవిస్తరణ కాంక్షకు తాను తొడ్పటు అందించినట్టు కాగలదు కనుక, స్వేచ్ఛా-స్వాతంత్య్రకాంక్ష గల స్వదేశీ పాలకులకు వ్యతిరేకంగా ఆంగ్లేయుల పక్షాన నలివటం ఏమాత్రం సహించని బేగం హజరత్‌ మహాల్‌ ఆ ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరించారు.

1857 జూన్‌ 30న చింహట్ వద్ద కంపెనీ బలగాలతో జరిగిన పోరాటంలో తిరుగుబాటు వీరులకు లభించిన విజయం ఇటు ప్రజలలో అటు తిరుగుబాటుకు సన్నధమౌతున్న స్వదేశీపాలకులలో, సైనికులలో ఉత్సాహాన్నిరేకెత్తించింది. ఆ ఉత్సాహంతో తిరుగుబాటు యోధులు మరింతగా రెచ్చిపోయారు. స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించారు. ఆ సమయంలో అవధ్‌ పతాకం క్రింద నాయకత్వం స్వీకరించి ఆంగ్లేయుల మీద పోరాటం సాగించేందుకు బలమైన నాయకుడి అవసరం వచ్చింది. నవాబు వాజిద్‌ అలీషా వంశస్థుల కోసం అంవేషణ ప్రారంభమైంది. బ్రిటిష్‌ పాలకులంటే ఏర్పడిన భయం వలన లక్నోలో ఉంటున్ననవాబు భార్యలు కొందరు తమ బిడ్డలకు, కలకత్తాలో ఉన్నభర్త బంధువులకు ఎటువంటి ప్రమాదం సంభవించగ 39