పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం:ముస్లింమహిళలు


త్యాగమయ చరిత్రలను విస్మరించటమే. ఈ అవకాశాన్ని స్వార్దపర రాజకీయ శక్తులు, వ్యక్తులు ఉపయోగించుకుంటున్నారు. ఈ ప్రమాదాకర పరిస్థితికి ప్రతిగా, ఆ త్యాగాల స్పూర్తిగా ప్రతి ఒక్కరూ భారతదేశ బంగారు భవితకై నడుం కట్టేలా ప్రోత్సహించాలి. అందుకు ప్రజలు, ప్రభుత్వాలు సహకరించాలి. అప్పుడు మాత్రమే త్యాగసంపన్నులైన మన పూర్వీకులకు మనం ఘ నమైన నివాళి అర్పించినవారం కాగలుగుతాం.

త్యాగాల చరిత్ర అందరికీ తెలియాలి

ప్రజలకు అన్నిసాంఫిుక జనసముదాయాల త్యాగాలు తెలియాల్సి ఉంది. పలు సాంఘి క జనసముదాయాలు కలసిమెలసి సహజీవం సాగిసున్న గడ్డ అయినటువంటి భరతబూమిలో ఆయా జనసముదాయాల మధ్య న సుహృద్భావ వాతావరణం ఏర్పడడానికి ఒకరి త్యాగపూరిత చరిత్రలు మరొకరికి తెలియాల్సిన ఆవసరం ఎంతైనా ఉంది. మాతృభూమి సేవలో పునీతమైన ప్రజలందరి చరిత్ర ఆన్ని సాంఘి క జనసముదాయాలకు తెలిసినప్పుడు మాత్రమే ఆయా జనసముదాయాల మధ్యన పరస్పర గౌరవం ఏర్పడుతుంది. ఆ గౌరవం సదావగాహనకు కారణమవుతుంది. ఆ సదావగాహన నుండి సధ్బావన, సహిష్ణుత ఉత్పన్నమౌతాయి. ఆ సహిష్ణుత, సామరస్యం, శాంతి-స్నేహాలకు బలమైన పునాది అవుతాయి.

ఈ వాతావరణంలో లౌకిక వ్యవస్థ పరిఢవిల్లుతుంది. మత విద్వేషాలు మట్టిలో కలసిపోయి మతసామరస్యం మరింతగా పిష్టమౌతుంది. మతోన్మాద రాజకీయ శక్తుల కుట్రలు, కుయుక్తులకు అడ్డుకట్ట పడుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా సామాన్య ప్రజలకు చేరువకాని ముస్లింల, ప్రధానంగా ముస్లిం మహిళల త్యాగమయ చరిత్రను ప్రజల చెంతకు చేర్చేందుకు సాగుతున్న కృషిలో అతి చిన్న ప్రయత్నమిది.

33