పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


కాపాడారు. చివరివరకు ఆమె ఉద్యమకారులకు చేయూత నిచ్చారు. వయస్సుతో నిమిత్తం లేకుండ, శరీరం సహకరించని వృద్ధ్దాప్యంలో కూడ పోరాటయోధులను అటు రజకార్ల నుండి, భూస్వాముల స్వంత సాయుధ బలగాల నుండి, ఇటు మిలటరీ దాడులు, సోదాల నుండి రక్షించుకునేందుకు ప్రాణాంతక సాహసాన్ని ప్రదార్శించిన మహిళలు మనకు తారసపడతారు. జాతీయోద్యామంలో పాల్గొనటం మాత్రమేకాకుండ సామ్యవాద భావాలతో ప్రభావితమై ఇటు ఇండియన్‌ యూనియన్‌లో నైజాం సంస్థానం విలీనం కోసం సాగిన పోరు, ఆ తరువాత అటు తెలంగాణా రైతాంగ పోరాటంలలో కూడ తమ త్యాగపూరిత భాగస్వామ్యాన్నిఅందించిన మహిళలలో బేగం రజియా, జమాలున్నీసా బాజీ లాింటి వారున్నారు.

నైజాం వ్యతిరేకపోరాటం నుండి తెలంగాణా రైతాంగ పోరాటం వరకు ముస్లిం కుటుంబాలు ఉద్యామ కారులను తమ కడుపులో పెట్టుకుని కాపాడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఆయుధాలు చేతపూని రణం చేసన సాహసులైన వీరవనితలు ఉన్నారు. వడిసెల గిరగిరా తిప్పుతూ శత్రువు మీద దాడి జరిపిన సమరశీల మహిళలు ఉన్నారు. ఆనాడు సామాజిక జీవన బంధనాలలో ఉంటూ కూడ బ్రిీటిష్‌ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న మహిళలు చరిత్ర గ్రంథాలలో తమదైన స్థానాన్ని సంపాదించుకోలేక పోయారు. అందాు వలన ఆ తల్లుల గురించి ప్రజలకు అతి తక్కువ మాత్రమే తెలిసింది. ప్రభుత్వం ప్రచు రించిన గ్రంథాలలో కూడ మహిళామణులకు స్థానం లభించకపోవడం విచారకరం.

ఈ విధాంగా పేర్కొంటూ పోతే అనేక మంది మణిపూసల్లాింటి మహిళలను మనం ప్రస్తావించుకోవచ్చు. ఈ మహిళల చరిత్రలు అక్కడక్కడ ఆయా ప్రాంతాలలో స్థానిక భాషలలో, స్థానిక చరిత్ర గ్రంథాలలో ఉన్నాయి. ఆనాటి వారి త్యాగాల గురించి అందరికి తెలియాలంటే జాతీయ స్థాయి ప్రామాణిక చరిత్ర గ్రంధాలలో అన్నిసాంఫిుక జనసముదాయాలకు చెందినస్వాతంత్య్రసమరయాధులందారికి తగిన స్థానం కల్పించాలి. ఆ క్ష్యంగా చరిత్ర గర్బంలో దాగిన మరెందరి చరిత్రలనో పరిశోధకులు వెలికి తీయాలి. ఆయా చరిత్రలను ఆయా ప్రాంతీయ భాషల్లో ప్రచురించాలి. ఆ చరిత్రలను పాఠ్య గ్రంథాలలో పొందుపర్చాలి. ఆనాటి త్యాగాల పరంపరకు భవిష్యతరాలను వారసు లను చేయాలి.

ప్రస్తుతం భారతీయ ప్రధాన జన సముదాయాల మధ్య మానసిక అంతరాలు, అపోహలు, అనుమానాలకు ప్రధాన కారణం ఆయా సాంఫిుక జన సముదాయాల

32