పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


అవతరించాక ఇండియన్‌ యూనియన్‌లో చేరడనికి నిరాకరించిన నైజాం సంస్థానాధీశుల పట్ల నఫీస్‌ ఆయేషా బేగం నిరసన వ్యక్తంచేశారు. నైజాం సంస్థానం భారతదేశంలో విలీనం కావాలని, నైజాం సంస్థానంలోని వాసులంతా భారతదేశ పౌరులుగా పరిగణంచ బడలని ఆమె ఆకాంక్షించారు.

ఈ ఆకాంక్షకు భిన్నంగా నిజాం సంస్థానాధీశులు, ఆయన మద్దతుదారులు వ్యవహరించటంతో ప్రజలు నిరసన వ్యకంచేశారు. ఈ నిరసనలు ప్రదర్సనలుగా మారాయి. ఈ వ్యతిరేక ప్రదర్శనల పట్ల ఆగ్రహించిన నిజాం ప్రభుత్వం ప్రదర్శనకారులను నిర్బంధించింది. అరెస్టుల పర్వం సాగించింది.

ఈ అరెస్టులలో భాగంగా ఆయేషా బేగం కూడ జైలు పాలయ్యారు. ఆమెను 1948, 16న అరెస్టు చేశారు. హైదారాబాద్‌ సెంట్రల్‌ జైలులో నిర్బంధించారు. ఆ అరెస్టులు ఆమెను అధైర్యపర్చలేదు. జైలు నుండి విడుదల తరువాత కూడ ఆమె లక్ష్యం సాధన పట్ల నిబద్ధాతతో సాగారు. చివరకు ఇండియన్‌ యూనియన్‌లో నైజాం సంస్థానం విలీనమైంది.

ఆ యోధురాలి పూర్తి వివరాలు తెలియలేదు. ఆంధ్రాప్రదేశ్‌ ప్రభుత్వం ఆద్వర్యంలో డాక్టర్‌ సరోజిని రెగాని సంపాదకత్వంలో రూపొందించిన Who's who of Freedom Struggle in Andhra Pradesh? సంపుటాలలో స్థానం పొందగలిగిన ఏకైక ముస్లిం మహిళ ఆయేషా బేగం కావటం విశేషం. ఆ గ్రంథంలో ఆమె అరెస్టుకు సంబంధించిన వివరాలను, కొద్దిపాి వ్యక్తిగత విశేషాలను పేర్కొనటంతో ఆ మాత్రమైనా ఆమె గురించి తెలుసుకునే అవకాశం కల్గింది.

♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦

పాలకులు ప్రజలకు వ్యతిరేకంగా అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడుతూ నియంతల్లా వ్యవహరిస్తుంటే,జనసముదాయాలన్నీ ఏకమై నియంతృత్వశక్తుల మీదా విరుచుకు పడాలి...వినాశన మార్గం నుండి మంచి మార్గం వైపుకు పాలకవర్గాలు మళ్ళేంత వరకు ఉద్యమాలు ఉధృతంగా సాగాలి. అంతిమంగా ప్రజలు విజయం సాధిస్తారు. ..మన మాతృభూమి భవిష్యత్తు దృష్ట్యా, మన గౌరవాన్ని కాపాడేందుకు ఈ గడ్డమీది ప్రతి హిందూ-ముస్లిం ఈనాడు భుజం భుజం కలిపి పోరాడల్సిన బాధ్యత ఉంది.

-బేగం జాఫర్‌ అలీ ఖాన్‌

♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦

236