పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇండియన్‌ యూనియన్‌లో నైజాం విలీనం కోరిన

నఫీస్‌ ఆయేషా బేగం

భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రజానీకం పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. పాలక పక్షాలకు వ్యతిరేకంగా ప్రత్యక్ష కార్యాచరణకు దిగిన వారికి పలురకాల శిక్షలు ప్రతిఫలంగా లభించాయి. వారి వివరాలు అందుబాటులో ఉంటున్నాయి. పరోక్షంగా జాతీయోద్యమానికి సహాయ సహకారాలు అందించి పోలీసుల చిట్టాలకు ఎక్కకుండ ఉండిపోయిన తెలుగు ఆడపడుచులు ఎందరో ఉన్నారు. ఆ తల్లుల త్యాగాలు ఎంత శ్లాఘనీయమైనవైనా అవి అక్షరరూపం ధరించకపోవటంతో ప్రజలకు అందుబాటులో లేకుండ పోయాయి.

ప్రత్యక్ష పోరులో శిక్షలకు గురైనవారి వివరాలు పోలీసుల రికార్డులలో నిక్షిప్తమై ఉన్నందున కొంతలో కొంత సమాచారం లభ్యం అవుతుంది. ఈ మేరకు పోలీసు రికార్డుల ఆధారంగా తయారైన గ్రంథాలలో స్థానం పొందిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మహిళా యోధురాలు శ్రీమతి నఫీన్‌ ఆయేషా బేగం.

ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత రాష్ట్ర రాజధాని హైదారాబాద్‌కు చెందిన జనాబ్‌ హమీద్‌ ఆలీఖాన్‌ కుమార్తె ఆయేషా బేగం. తండ్రి జాతీయ భావాలతో ప్రభావితురాలైన ఆయేషా బేగం హైదారాబాద్‌ కేంద్రంగా జాతీయోద్యమంలో పాల్గొన్నారు. స్వతంత్ర భారత దేశం

235