పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాతృదేశ సేవ విలువకట్టరానిదని ప్రకటించిన

సఫియా అబ్దుల్‌ వాజిద్‌

(1905-)

ఈ గడ్డ మీద పుట్టి పెరిగి, ఇక్కడి గాలి పీల్చి, నీరు తాగిన ప్రతి ఒక్కరూ తమ ప్రతిభా సంపన్నతను బట్టి మాతృభూమి రుణం తీర్చుకోవాల్సి ఉంటుంది. మనిషి తాను సాధించినదాంతాస్వశక్తి ద్వారా మాత్రమే సాధించాడని భావిస్తాడు. ఈ దేశం కోసం ఏ కించిత్తు పనిచేసినా తానేదో సేవ చేస్తున్నట్లు భుజకీర్తులు తగిలించుకుాండు. ప్రతిభా సామర్ధ్యాలన్నీ ఈ నేలతల్లి బిడ్డలు అందించిన ఉమ్మడి ఆస్తి అని గ్రహిస్తే, అప్పుడు మాత్రమే ఈ గడ్డకు తాను ఎంత రుణపడి ఉన్నాడో అర్థం చేసుకుని ప్రవర్తిస్తాడు. ఆ దిశగా మాతృదేశ విముక్తి కోసం తాను చేసినదంతా తల్లి రుణం తీర్చుకోవడమేనని తన ప్రవర్తన ద్వారా తెలియజేసిన మహిళ శ్రీమతి సఫియా అబ్దుల్‌ వాజిద్‌. శ్రీమతి సఫియా అబ్దుల్‌ వాజిద్‌ 1905లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో జన్మించారు. ఆయన తాత, తండ్రి ఉన్నతాధికారులు. విశాల దృక్పథం గల కుటుంబమది. అలహాబాద్‌ విశ్వవిద్యాలయంలో ఆమె పోస్ట్‌ గాడ్యుయేషన్‌ చేశారు. చిన్నతనం నుండి తాత తండ్రుల వద్దకంటే జాతీయ భావాలు గల మేనమామ సయ్యద్‌ అబ్దుల్‌ వదూద్‌ వద్దా పెరగటంతో, ఆమెకు జాతీయోద్యమం పట్ల అధిక ఆసక్తి కలిగింది. ఆమె ప్రముఖ న్యాయవాది మౌల్వీ 231