పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


అబ్దుల్‌ వాజిద్‌ బరేల్విని వివాహమాడరు.ఆయన బ్రిటీష్‌ వ్యతిరేక పోరాటాలలో పాల్గొంటున్న జాతీయవాది. పుట్టినింటనే కాకుండ, మెట్టినింట కూడ ఆమెకు జాతీయ భావాల సమర్థకులు తోడు కావటంతో భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వంస్వీకరించి, బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన రహస్య కార్యకలాపాలలో ఆమె పాల్గొన్నారు.

ఈ కారణాన్ని సాకుగా చూపి ప్రభుత్వంఆమెను లెక్చరర్‌ ఉద్యోగం నుండి తొలగించింది. ఆమె కార్యనిర్వహణా దక్షత, రాజకీయాల పట్ల గల అవగాహనను గమనించిన మహాత్మాగాంధీ పర్దా ను వదిలి ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాల్సిందిగా స్వయంగా ఆహ్వానించారు. భర్త కూడ గాంధీజీ మాటను గౌరవిస్తూ ఆమెను ప్రోత్సహించారు. అప్పటినుండి ఆమె జాతీయోద్యమ నాయకురాలిగా పలు కార్యక్రమాలను నిర్వహించి ప్రజాదరణతోపాటుగా జాతీయ స్థాయి గుర్తింపు పొందారు.

భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించాక ఆమె అందించిన త్యాగమయ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వంఆమెకు స్వాతంత్య్రసమరయాధుల పెన్షన్‌ మంజూరు చేసింది. ప్రభుత్వాధినేతలు తన కృషిని జ్ఞప్తియందుచుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పెన్షనను నిరాకరించారు. ఈ సందర్బంగా ఆమెమాట్లడుతూ, స్వాతంత్య్ర సమరయోధాుల పెన్షన్‌ స్వీకరిస్తే అది నా మాతృదేశ భక్తికి ఖరీదు కట్టినట్లు కాగలదు అని ప్రకించారు. ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికి పెన్షన్‌ సౌకర్యాన్ని తిరస్కరించారు.

1952లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సఫియా అబ్దుల్‌ వాజిద్‌ కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్టు మీద పోటిచేశారు. ప్రజలు ఆమెను గెలిపించి శాసనసభకు పంపారు. ప్రజా ప్రతినిధిగా 1957 వరకు ఆమె పనిచేశారు. శాసనసభ్యురాలిగా రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు.

పండు వయస్సులో కూడ జాతి జనుల సేవలో గడిపిన సఫియా అబ్దుల్‌ వాజిద్‌ తానేదో ప్రజాసేవ చేస్తున్నట్లుగా ప్రకించుకోలేదు. తాను ప్రత్యేకంగా త్యాగాలు చేసింది ఏమిలేదని, ఈ గడ్డమీద పుట్టి పెరిగి నందున గడ్డ రుణం తీర్చుకుంటున్నానని వినమ్రపూర్వకంగా తెలుపుకున్నారు.

232