పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దళిత జనహితైషి, పోలియోవ్యతిరేక పోరాటయోధురాలు

'పద్మశ్రీ' ఫాతిమా ఇస్మాయిల్‌

(1903-1987)

జాతీయోద్యమం భారతీయులలో మహత్తర సేవాతత్పరతకు ప్రేరణయ్యింది. ఆ స్పూర్తితో కుటుంబాలకు కుటుంబాలు ఉద్యమంలో పాలుపంచుకున్నాయి. బ్రిటీష్‌ వలస పాలకుల కిరాతకాలను లెక్కచేయక పోరుబాటన నడిచాయి. అటువంటి కుటుంబంలో సభ్యురారాలిగా తల్లి తం డ్రి , అన్నా-తముళ్ళ బాటలోసాగి అటు జాతీయోద్యమంలో ఇటు సేవారంగంలో అద్వితీయమైన పాత్ర నిర్వహించిన మహిళ శ్రీమతి ఫాతిమా ఇస్మాయిల్‌.

నాటి గుజరాత్‌ రాష్రం బొంబాయికి చెందిన ప్రసిద్ధ స్వాతంత్య్రోద్యమ నాయకులు హజీ ముహమ్మద్‌ యూసుఫ్‌ సోహాని కుమార్తె బేగం ఫాతిమా. ఆమె కుటుంబం సంపన్న మోమిన్‌ వంశానికి చెందినది. ఆమె అన్నయ్య ముహమ్మద్‌ ఉమర్‌ సోహాని. చిన్నన్నయ్య ముహమ్మద్‌ ఉస్మాన్‌ సోహాని. ఉమర్‌ సోహాని బొంబాయిలో ప్రముఖ వ్యాపారవేత్త. ఆ ఇరువురు సోదరలు కూడ తండ్రి మార్గంలో విముకక్తి పోరాట బాటలో ముందుకు సాగారు. జాతీయోద్యమ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అవసరమగు ఆర్థిక పుష్టిని అందించటంలో ఆ సోదరులు ముందున్నారు. ఆనాడు భూరిగా విరాళాలు అందచేతలో ప్రధానంగా ఉమర్‌ సోహాని ప్రఖ్యాతి గడించారు. 207