పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

సాహితివేత్త, రచయిత, జర్నలిస్టు. అన్నిటి కంటే జాతీయోద్యమ నాయకులలో ప్రముఖులు. భర్త సహచర్యంలో ఒకవైపున జాతీయోద్యమంలో పాల్గొంటూ అప్పటికే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అమె జర్నలిజంలో శిక్షణ పొందారు. భార్యభర్తలు జాతీయవాదులు కావటంతో జాతీయోద్యమంలో చురుకైన పాత్రను నిర్వహించారు.

బేగం సుల్తానా హయాత్‌ అన్సారి ముస్లిం లీగ్‌ వేర్పాటువాదన్ని నిరసించారు. లీగ్‌నాయకుల వాదనలను పూర్వపక్షం చేస్తూ ప్రసంగాలు చేశారు. పత్రికలలో ప్రకటనల ద్వారా విభజన ప్రమాదాన్ని ప్రజలకు తెలిపారు. చివరకు స్వదేశానికి ' స్వరాజ్యం ' సిద్ధించినా, దేశం రెండుగా చీలిపోయినందున ఆ దుఃఖభారంలో మునిగిన సుల్తానా దంపతులు క్రియాశీల రాజకీయాల నుండి నిష్క్రమించారు.

ఆ విధంగా రాజకీయాలకు దూరమైన ఆ దంపతులు, హిందూ-ముస్లింల ఐక్యతకు కృషి ప్రారంభించారు. మత వైషమ్యాలను రెచ్చగొట్టే శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఉర్దూ భాషా పరిరక్షణోద్యమానికి ఎంతగానో చేయూతనిచ్చారు.ఈ లక్ష్యసాధన కోసం అంజుమన్‌ తారఖ్ఖీ-యే-ఉర్దూ Anjuman Taraqqi-e-Urdu)అను సంస్థను స్థాపించారు. ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా ఆమె పనిచేశారు. ఉర్దూ భాషను రక్షించాలని, ఆ భాషను అభివృద్థిపర్చాలని డిమాండ్‌ చేస్తూ, 20 లక్షల సంతకాలతో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి భారీ మహజరు సమర్పించారు.

మహిళలలో చెతన్యజ్యోతులు వెలిగించేందుకు సుల్తానా హయాత్‌ పలు మహిళా సంఘాలను, సంస్థలను స్థాపించారు. ఆ సంస్థలు ప్రస్తుతం శాఖోపశాఖలుగా విస్తరించి మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాయి. మత సామరస్యానికి పాటుపడుతూ, మత మౌఢ్యానికి, అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాడుతూ, మహిళా సంఘాలకు, ప్రజా సంఘాలకు మార్గదర్శకత్వం వహిస్తూ సుల్తానా హాయాత్‌ అన్సారి అశేష ప్రజానీకం ప్రేమాభిమానాలకు పాత్రులయ్యారు.

స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్‌ స్వీకరిస్తే అది నా మాతృదేశ భక్తికి నేను ఖరీదు కట్టినట్లు కాగలదు. అందువలన పెన్షన్‌ నాకొద్దు. - సఫియా అబ్దుల్‌ వాజిద్‌. 206