పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

1940 ప్రాంతంలో హాజౌరా బేగం, డకర్‌ అహమ్మద్‌ భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ నుండి బయటకు వచ్చేశారు. అప్పినుండి ఆ ఇరువురు కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాలలో పూర్తిగా నిమగ్నమయ్యారు.అసంఘిత కార్మికులను సంఘితం చేసి కార్మిక సంఘాలను స్థాపించటంలో ప్రధాన భూమిక నిర్వహించారు. ఈ క్రమంలో ఆమె అలహాబాదులో రైల్వే కూలీల సంఘం స్థాపించారు. అంతవరకు ఎవ్వరూ కూడ రైల్వేకూలీల సమస్యలు ప్టించుకున్న వారులేరు. అసలు రైల్వేకూలీల సంఘం ఏర్పాటు చేసినవారు లేకపోవటంతో రైల్వే కూలీల సంఘం నిర్మాతగా ఆమె రైల్వేకూలీల గౌరవాభిమానాలను అందుకున్నారు. ఆ కారణంగా రైల్వేకూలీలు ఆమెను తమ ప్రవకగా ప్రకించుకున్నారు. ఈ కార్యక్రమాలలో ఆమెకు అలహాబాద్‌కు చెందిన షా అబ్దుల్‌ ఫ్ధజ్‌ సహకరించారు. (మేర జీవన్‌ కీ కుచ్‌ యాదేౌ (హిందీ) ó పేజీ.200) ఈ సందార్బ ంగా ఆమె మీదా దాడులు జరిగాయి. ఆమెను చంపుతామని బెదిరింపులు వచ్చాయి. బేగం హాజౌరా అ బెదిరింపులకు భయపడలేదు. ఆ ప్రమాదకర పరిసితులలో అలహాబాద్‌లోని రైల్వేకూలీలు అండగా నిలచి ఆమెను రక్షించుకున్నారు.

బేగం హాజౌరా మహిళా కార్మికుల సంకే∆మం పట్ల ప్రత్యేక శ్రద్ధా చూపారు. మహిళలలో చైతన్యం కోసం సభలు-సమావేశాలు నిర్వహించారు. మతోన్మాదం వలన కలిగే అనర్ధాలను వివరిస్తూ ప్రజలను చైతన్యపర్చేందుకు విశేషంగా కృషి చేశారు. మత సామరస్యం ప్రబోధించారు. హిందూ- ముస్లింల ఐక్యత కోసం పనిచేశారు. నూతన కార్మిక సంఘాల ఏర్పాటు, ఆ కార్మికుల హక్కుల రక్షణ, సంక్షేమం కోసం నిరంతరం శ్రమించారు. వృద్ధాప్యాన్ని కూడ లెక్క చేయక బేగం హాజౌరా సమాజసేవలో పాల్గొన్నారు.

ప్రజా జీవనరంగాలన్నిిని స్పృశించి, తనదైన సేవలను అందించిన శ్రీమతి హాజౌరా బేగం గౌరవార్థ 1960లో సోవియ్‌ట్ యూనియన్‌లో జరిగిన కామ్రేడ్‌ లెనిన్‌ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆమెకు సుప్రీం సోవియ్‌ట్ జూబ్లీ అవార్డు ప్రకటించారు. పండు వయస్సులో కూడ బేగం హాజౌరా దంపతులు కష్టజీవుల సంక్షేమం కోసం ఆవిశ్రాంతంగా కృషిసాగించారు.

200