పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహిళా కార్యకర్తలచే ఆయుధం ధరింపచేసిన సమరశీలి

సుల్తానా హయాత్‌ అన్సారి

సుదీర్ఘంగా సాగిన భారతస్వాతంత్య్ర సంగ్రామ చరిత్రను పరికిస్తే, వలస పాలకులకు వ్యతిరేకంగా ముత్తాత, తాత, తండ్రి, తనయులు ఉద్యమించిన కుటుంబాలు చాలా తక్కువగా దర్ నమిస్తాయి.స్వదేశాన్ని పరాయిపాలకుల నుండి విముకం చేయాలన్న సంకల్పం పూర్వీకుల నుండి వారసత్వంగా లభించటం, ఆ మేరకు మాతృభూమి సేవలో తరించటం లాంటి మహత్తర అవకాశం లభించిన కుటుంబానికి చెందిన తనయ బేగం సుల్తానా హయాత్‌.

సుల్తానా హయాత్‌ ముత్తాత ఖాజీ జియావుద్దీన్‌ ఢిల్లీ నగర ఖాజీగా బాధ్యతలు నిర్వహిసున్నారు. 1857లో ఆయన ఆ పదవికి రాజీనామా చేసి బ్రిటీషరకు వ్యతిరేకంగా తిరుగుబాటు యోధులకు సహకరించారు. ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామ సేనాని భక్త్‌ఖాన్‌ సలహా మీద ఆవధ్‌ సంస్థానానికి వెళ్ళడానికి మొగల్‌ పాదాుషా బహుద్దాూర్‌ షా జఫర్‌ నిరాకరించాక, భక్త్‌ ఖాన్‌ ఢిల్లీ నుండి తన బలగాలతో ఆవథ వైపుకు సాగారు. ఆ లోగా ఢీల్లీ పూర్తిగా ఆంగ్లేయుల వశమైంది. ఆ సమయంలో ఆంగ్లేయ సైనికుల కళ్ళుగప్పి ఆవథ్‌కు పయనమైన భక్త్‌ఖాన్‌, ఆయన బలగాలు ఢిల్లీ నుండి తప్పుకోడనికి ఖాజీ జియావుద్దీన్‌ సహయపడ్డారు. ఆ విషయం తెలుసుకున్న ఆంగ్లేయ అధికారి హడ్సన్‌ జియావుద్దీన్‌ మీద మండిపడుతూ ఆయన గృహం మీద దాడిచేశాడు. ఆస్థిపాస్తులను విధ్యంసం 201