పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

ఆదరణ లభించాలని ఆకాంక్షింస్తున్నాను ' అని నా మనసులోని మాటను ముందు మాటగా రాశాను. నా ఆకాంక్షను మూడు ప్రచురణల ద్వారా తెలుగు పాఠకులు ఇంత ఘనంగా నెరవేర్చుతారని నేను ఆనాడు ఊహించలేదు. నా ఊహకు అందని విధాంగా చరిత్ర పుస్తకాలను ఆదరించిన తెలుగు పాఠకులకు, ప్రచురణకర్తలకు ప్రత్యేక అభినందనలు.

మన సమాజంలో ముస్లిం మహిళలకు సంబంధించి కొన్ని అపోహలు ఉన్నాయి.ప్రజా జీవన వ్యవహారాలలో ముస్లిం మహిళలు పాల్గొనరని, పర్దాచాటు నుండి బయట ప్రపంచంలోకి ముస్లిం మహిళలు ససేమిరా రారని అనుకుంటారు.ముస్లిం మహిళల సంగతి ఎలా ఉన్నా ముస్లింలు స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొనలేదన్న సాధారణ అపోహ కూడ బలంగా ఉంది. ఈ రెండూ నిజం కావు. చరిత్ర తిరగేస్తే అనేక యుద్ధాలు, పోరాలు, ఉద్యమాలలో పాల్గొని పోరాట పటిమ చూపిన ముస్లిం మహిళల వృత్తాంతాలు అనేకం కన్పిస్తాయి.

ఆ కాలంలో ముసిం మహిళలు ఖచ్చితంగా ' పర్దా ' ను పాిటిస్తూసాధారణంగా తమ గృహాల నుండి బయటకు వచ్చేవారు కారు. అయితే మాతృదేశ దాస్య విముక్తి పోరాటం కంటె తమకు ఏదీ ప్రియమైనది కాదాని భావించిన ఆ మహిళలు ఆనాి సామాజిక కట్టుబాట్ల ఉల్లంఘనకు కూడ సిద్ధమై స్వాతంత్య్ర సమరాంగణంలో పాల్గొని అపూర్వమైన సాహసాన్ని, అనితరసాధ్యమైన త్యాగాన్ని, నిబద్ధతను ప్రదార్శించారు.

ఈ చరిత్రలు చాలా వరకు మరుగునపడి ఉన్నాయి. ఆ మహత్తర చరిత్రలు అక్కడక్కడ వెలుగులోకి వచ్చినా అవి సామాన్యుల చెంతకు చేరటం లేదు. అవి చరిత్ర పండితుల వరకు పరిమితమై పోతున్నాయి. ఆ చరిత్రలన్నిటినీ వెలుగులోకి తీసుకురావాల్సి ఉంది. అద్వితీయ త్యాగాలతో, అద్బుత పోరాట పటితో, మాతృభూమి పట్ల ఉన్నఅంతులేని గౌరవాభిమానాలతో పోరుబాట నడిచి ప్రత్యేక చరిత్రను సృష్టించిన మహిళల చరిత్రలను ఆయా ప్రాంతీయ భాషలలో రచించినట్టయితే అత్యధిక ప్రయోజనం సమకూరుతుంది. ఆయా విషయాలు అత్యధికులకు చేరువవుతాయి. ఆ లక్ష్యంగా, ఆ దిశగా చరిత్ర పరిజ్ఞానాన్ని ప్రజాస్వామ్యీకరించేందుకు నిరంతరం కృషి సల్పుతున్న మిత్రుడు సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ అభినందనీయుడు.

16