పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రచయిత మాట

1999లో భారత స్వాతంత్య్రోద్యమం : ముస్లిం మహిళలు పుస్తకాన్ని తొలుత ప్రచురించాను. అది స్వాతంత్య్రోద్యామంలో ముస్లిం మహిళల పాత్రను వివరిస్తూ తెలుగులో వచ్చిన తొలి పుstaకం కావటంతో పాఠక మహాశయుల ఆదారణ లభించింది. ఈ పుస్తకానికి లభించిన పాఠకుల ఆదారణ, పండితుల, పెద్దల ప్రోత్సాహం, సన్నిహిత మిత్రులు వ్యక్తం చేసిన సూచనలు, అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని, ఆనాటి రాజకీయ - సామాజిక వాతావరణం దృష్ట్యా భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల భాగస్వామ్యాన్ని వివరిస్తూ మరిన్ని పుస్తకాలను రాసి ప్రచురించాలని నిర్ణయించాను. ఈ మేరకు చారిత్రక సమాచారం కోసం సాగిన అన్వేషణలో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నపలువురు ముస్లిం మహిళల జీవిత విశేషాలు చాలా లభించాయి, ఎంతో ఆదనపు సమాచారం అందుబాటులోకి వచ్చింది.

ఆ విధంగా లభించిన నూతన వివరాలతో నాకు అందిన అదనపు సమాచారంతో,భారత స్వాతంత్య్రోద్యమం: ముస్లిం మహిళలు పుస్తకాన్ని పూర్తిగా తిరగరాసి ప్రచురించాలనుకున్నాను. ఆ ప్రయత్నంలో నేనుండగా మిత్రులు, ప్రముఖ రచయిత డాక్టర్‌.యస్‌. రావు (విజయవాడ) సహకారంతో జె.పి. పబ్లికేషన్స్‌ (విజయవాడ) వారు ఈ పుస్తకాన్ని 2003లో ప్రచురించారు. ఆ పుస్తకంలో అదనంగా మరికొందరి మహిళల జీవిత విశేషాలను చేర్చడమే కాకుండ, ప్రథమ ముద్రణలోని సమాచారానికి అదనపు సమాచారాన్ని జతచేశాను. ప్రథామ ప్రచురణకు లభించినట్టుగా ద్వితీయ ప్రచురణకు కూడ పాఠకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

ఆ ఆదరణ పర్య వస్తానంగా ప్రస్తుతం భారత స్వాతంత్య్రోద్యామం : ముస్లిం మహిళలు మూడవ ముద్రణకు రావటం సంతోషంగా ఉంది. ఈ పుస్తకాన్ని తెలుగు ఇస్లామిక్‌ పబికషన్స్‌ (హెదారాబాద్‌) సరికొత్తగా ప్రచురించ సంకల్పించింది. ఆ సంస్థ సంచాలకులు జనాబ్‌ అబ్బాదుల్లా పుస్తక ప్రచురణ విషయమై మాట్లాడుతూ, 2003లో ప్రచురితమైన పుస్తకాన్ని పూర్తిగా తిరగరాసి నూతన సమాచారం జోడించి, నూతన చిత్రాలు, ఫోటోలు సమకూర్చాలని కోరారు. అలనాటి త్యాగమూర్తుల వివరాలన్నీ లభ్యమైనంత వరకు పాఠకులకు అందించాలని, ఆ కారణంగా పుస్తక పరిమాణం పెరిగినా ఫర్వాలేదన్నారు.ఆయన సూచనలను-సలహాలను గౌరవిస్తూ, ప్రథమ, ద్వితీయ ప్రచురణలను చదివిన చరిత్ర అధ్యాపకులు, పరిశోధకులు, పాఠకులు అందించిన సూచనలు, సలహాలను కూడ పరిగణలోకి తీసుకున్నాను.

17