పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


1914 అక్టోబర్‌ 20న డాక్టర్‌ సైఫుద్దీన్‌ కిచ్లూను ఆమె వివాహం చేసుకున్నారు. ఆయన కూడ స్వాతంత్య్ర సమరయోదులు. విదేశాలలో ఉన్నత చదువులు పూర్తిచేసి ఇండియా వచ్చిన ఆయన బ్రిటిషు వ్యతిరేక పోరాలకు జీవితాన్ని అకితం చేశారు. సాదాత్‌ బానోతో వివాహానంతరం న్యాయవాదిగా రావల్పిండిలో తొలుత ప్రాక్టీస్‌ ప్రారంభించి, తరువాత అమృతసర్‌లో స్థిరపడ్డారు. బానిసత్వం నుండి విముకవుౖ ప్రజలు స్వతంత్ర భారతావనిలో స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ సంతోషంగా గడపాలని కాంకిస్తూ కఠిన కారాగారవాసాన్ని, బ్రిటీష్‌ పోలీసుల క్రూర హింసలను భరించారు.

1919 సంవత్సరాంతంలో ప్రవాసం నుండి బయటకు వచ్చాక డక్టర్‌ సైఫుద్దీన్‌ లక్షలను ఆర్జించి పెడుతున్న న్యాయవాదా వృత్తిని పూర్తిగా మానేసి ఖిలాఫత్‌ ఉద్యామానికి, జాతీయ కాంగ్రెస్‌ కార్యక్రమాలకు అంకితమయ్యారు. స్వాతంత్య్రోద్యామ చరిత్రలో జలియన్‌వాలా బాగ్‌ హీరోగా ఖ్యాతి గాంచిన ఆయన బ్రిటీష్‌ వలసవాదాుల చర్యలను తీవ్రంగా వ్యతిరేకించటంతో అత్యధిక కాలం జైళ్ళల్లో గడిపారు. జాతీయ ఉద్యామనేతగా పలుమార్లు కారాగారవాస శిక్షకు గురై, తన జీవితంలోని అత్యంత విలువైన 14 సంవత్సరాల కాలాన్ని జైలు గోడల మధ్యాన గడిపిన పోరాట చరిత్ర ఆయనది. (Muslims In India, Volume II, Naresh Kumar Jain, Manohar, New Delhi, 1983, Page. 27.)

బ్రిీషు వ్యతిరేక కార్యకలాపాల కారణంగా సాదత్‌ బానో గృహం మీదా అనునిత్యం పోలీసుల నిఘా ఉండేది. సోదాలు, దాడులు ఆ ఇంటికి మామూలయ్యాయి. పోలీసుల వేధింపుల తాకిడిని తట్టుకుంటూ ఎంతో ధైర్యంగా నిలవటమే కాకుండ, జైళ్ళల్లో గడుపుతున్న భర్తకు ధైర్యం చెబుతూ కుటుంబం గురించి ఏమాత్రం పట్టించు కోకుండ పోరుబాటలో సాగాల్సిందిగా ఆమె ప్రోత్సహించారు. అందుకు తగట్టుగా సైపుద్దీన్‌ కిచ్లూ బ్రిీషు వ్యతిరేక పోరాటంలో అగ్రగామిగా నిలచారు.


మతోన్మాద భావనలకు వ్యతిరేకంగా సాదాత్‌ బానో కిచ్లూ కలం పట్టి పోరాడరు. బయి శత్రువును తరిమి కొట్టాలంటే, హిందూ-ముస్లింల ఐక్యత అత్యవసరమని ఆమె తన కలం దద్వారా, గళం ద్వారా పలుమార్లు ఉదాహరించారు. హిందూ-ముస్లింల ఐక్యతను ప్రగాఢంగా వాంఛించారు. ఆ దిశగా నిరంతరం కృషి సాగించారు. ఆ ప్రయత్నాలలో భాగంగా హింద్జూ సోదరుల మత మనోభావాలను గాయపర్చే ఏ పనులు చేయరాదని ముస్లింలకు హితవు పలికారు. ఆ హితవులను తాను ఆచరించి చూపారు. హిందూ 168