పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


మౌల్లా' ప్రచురణను బేగం నిశాతున్నీసా చేపట్టగా బేగం ఖుర్షీద్‌ ఖాజా 'జామియా మిలియా ఇస్లామీయ' విద్యా కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ 'హింద్‌' అను ఉర్దూ మాసపత్రికకు సంపాదాకురాలిగా విధులను నిర్వర్తించారు. బీబీ అమతుస్సలాం 'హిందాూస్థాన్‌' అనే ఉర్దూ పత్రికను నిర్వహించారు. మరికొందరు తమ రచనలతో ఉద్యమానికి స్పూర్తినిచ్చారు. హాజౌరా ఆపా అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యురాలు కూడ.స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటూ లింగవివక్షత వైపు దృష్టి సారించి, స్రీలను చెతన్యవంతులను చేయడానికి స్త్రీ విద్య సాధనమని గుర్తించి ఆ దిశగా ప్రయత్నించిన స్రీలూ కనిపిస్తారు . సంప్రదాయ మూఢచారాలకు, పర్దా వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటమూ కనిపిస్తుది.

స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ముస్లిం మహిళలందరూ హిందూ- ముస్లిం ఐక్యత కోసం కృషి చేసినవారే. ఉద్యమం చివరిదశలో బ్రిటిష్‌వారి కుతంత్రాల ఫలితంగా పరిస్థితులు దేశవిభజనకు దారి తీయగా దానిని వ్యతిరేకించారు ఈ ముస్లిం మహిళలు. అదేవిధగా నైజాం ప్రాంతం భారతదశంలో విలీనం కావాలని ఆందోళన చేసినవారిలో ముస్లిం మహిళలు ఉన్నారు. భారతదేశ విభజన వల్ల ఆస్తులు పాకిస్తాన్‌ భూభాగంలో ఉండిపోయినా, భారతదేశంలోనే వుండి కటిక పేదారికాన్ని అనుభవించిన ఉద్యమకారిణులూ కనిపిస్తారు. జాతీయోద్యమంలో పాల్గొన్న ఈ ముస్లిం మహిళలు 'భారతదేశం తమ మాతృభూమి' అన్నభావనతోనే ఎంత త్యాగానికైనా సిద్ధపడటం వీరి జీవితాలను గురించిన అధ్యాయనం వెల్లడిచేస్తుంది. స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములు కావటమే కాకుండ, బ్రిటిషర్ల తొత్తులైన జమీందారులకు వ్యతిరేకంగానూ, స్వాతంత్య్ర సిద్ధించాక ప్రజా ఉద్యమాలలో,తెలంగాణా రైతాంగపోరాటంలోనూ పాల్గొన్నముస్లిం మహిళలు కూడ ఉన్నారు. గాంధేయమార్గాన్ని అనుసరిస్తూ సమాజ సేవకు అంకితం కావటం పట్ల కృతజ్ఞతతో స్వతంత్ర భారత ప్రభుత్వం ఫాతిమా ఇస్మాయీల్‌, కుల్సుం సయానీలకు 'పద్మశ్రీ' బిరుదునిచ్చి సత్కరించింది. వీరిలో కుల్సుం సయానీ 1957లో యూనిస్‌కో సమావేశంలో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. 1958లో ప్రభుత్వ స్త్రీ విద్యకోసం నియమించిన 'నేషనల్‌ కమీషన్‌ ఆన్‌ విమన్స్‌ ఎడ్యుకేషన్‌' అనే కమిటీలో ఈమె సబ్యురాలు. మహాత్మాగాంధీ శాంతి సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పటానికి 11 దేశాలు పర్యటించింది. భారత్‌-పాకిస్థాన్‌ దేశాల మధ్యస్నేహం కోసం కృషి

12