పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు

భాగస్వామ్యం అని ఖచ్చితంగా విభజించటం కష్టం. సమావేశాలు నిర్వహించడం, ప్రసంగించటం, పికిటింగులు జరపటం, ఊరేగింపులో పాల్గొనటం, పోలీసు లాఠీ దెబ్బలను తినటం, జెలుకెళ్ళటం, శిక్షననుభవించటం ఉద్యమానికి ఎంత ముఖ్యమో నిధులను సమీకరించటం, ఉద్యామకారులు జైలుకెళ్ళినప్పుడు వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకొనటం, నేటికి మద్దతు నివ్వటం, ఉద్యమకారులకు ఆశ్రయ మివ్వటం,ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి పత్రికలు నడపటం, రచనలు చేయటం, తమ ఇంటిని పురుషులు ఉద్యమంలో నిమగ్నమైనప్పుడు కుటుంబ బాధ్యతలు సంపూర్ణంగా స్వీకరించటం, పోలీసుల దాష్టికాన్ని భరించటం, ఎంతకషనష్టాలకైనా సంసిద్ధులు కావటం మొదలైనవన్ని ఉద్యమం నిలదొక్కు కొనటానికి, లక్ష్యాలను సాధించానికి అంతే ముఖ్యం. కాబట్టి సమగ్ర దృష్టితో, సునిశితంగా పరిశీలించినట్లయితే ఉద్యమంలో ప్రత్యక్ష, పరోక్ష భాగస్వామ్యం అనే విభజన కృత్రిమమైనదే. చాలా సందర్భాలలో ఉద్యమకారుల కుటుంబాలకు చెందిన మహిళల భాగస్వామ్యం ప్రారంభంలో మరోకరూపంలో ఉన్నట్లు కనిపించినా, భర్త జైలుకెళ్ళినప్పుడు, భర్త చేపట్టిన బాధ్యతను నిర్వర్తించే క్రమంలో స్త్రీలు పోరాటంలో ముందుండటం గమనించదగింది.

అక్బరీ బేగం, అమినా తయ్యాబ్జీ, షంషున్నిసా అన్సారీ, సుఫయాసోం, అంజాదీ బేగం మొదలైనవారు ఉద్యమ నాయకత్వస్థానంలో వుండి ఉద్యమాన్నిసమర్దవంతంగా నిర్వహించారు. కాగా కార్యకర్తలుగా కూడ ముస్లిం స్రీలు పోరాటాలలో ముందుండి లాఠీ దెబ్బలు తిని, అరెస్టయి, జైలుశిక్షలను అనుభవించినారు. స్త్రీలను సమీకరించడంలో కీలక పాత్రను పోషించారు. బ్రిీటిష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బ్రెజిల్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశానికి 'హజరా ఆపా' భారత దేశ ప్రతినిధిగా హజరయ్యారు. అక్బరీ బేగం, మహాబూబ్‌ ఫాతిమా, అంజాది బేగం, సుగరా ఖాతూన్‌, సాదాత్‌ బానో కిచ్లూ తదితరులు ఉత్తేజపూరిత ప్రసంగాలతో ప్రజలను ఉద్యమోన్ముఖులను చేయటంలో కృతకృత్యులయ్యారు. కాగా ఉమర్‌ బీబీ, ఆమనా ఖురేషి మొదలైనవారు కార్యకర్తలుగా విదేశీ వస్త్ర దాహనంలో ముందుండి తమ వస్తువులను దాహనం చేయటంతో ఉద్యమాన్నిప్రారంభించారు. అన్ని పోరాట రూపాలలో కూడ ముస్లిం స్త్రీలు ముందుండి లాఠీ దెబ్బలను తిని, అరెస్టయి, జైలు శిక్షలను అనుభవించారు.

భర్త అరెస్టయినప్పుడు బ్రిీటిష్‌ వ్యతిరేకతను ప్రచారం చేసే 'జమిందార్‌' పత్రిక ప్రచురణ బాధ్యతను బేగం జాఫర్‌ అలీఖాన్‌, అదేవిధంగా 'ఉర్దూ-ఏ-

11