పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


తండ్రి సాంప్రదాయక ధార్మికుడు కనుక ఆ మార్గంలోనే పెరిగినా లోకం పోకడను మాత్రం చిన్ననాట నుండి ఆసక్తిగా గమనించారు. 1914లో లూధియానాకు చెందిన ప్రముఖులు మౌలానా హఫీజుర్రెహమాన్‌ను వివాహమాడారు.

జాతీయోద్యమంలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్న మౌలానా హబీబుర్రెహమాన్‌ జమాఅత్‌-ఏ-ఉలేమా-ఏ-హింద్‌, భారత జాతీయ కాంగ్రెస్‌లో క్రియాశీలక సభ్యులు.బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో ఆయన ఆత్యంత కీలక పాత్ర నిర్వహించారు. ఖిలాఫత్-సహాయ నిరాకరణ ఉద్యమనేతగా ఖిలాపత్‌ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. మంచి వక్తగా ఖ్యాతిగాంచిన మౌలానాకు మారువేషాలలో ప్రభుత్వ గూఢచారుల కన్నుగప్పి, పోలీసులకు చిక్కకుండా ముప్పు తిప్పలు పెట్టిన సాహస చరిత్ర ఉంది. ఆ కారణంగా పోలీసులు కక్షగట్టటంతో మొత్తం మీద మౌలానా 10 సంవత్సరాల ఆరు నెలలపాటు పలు జెళ్ళ ల్లో గడపారు. (Muslims In India, MK Jain,Manohar, New Delhi, 1979, Page.186)

అవిశ్రాంత ఉద్యమకారుని భార్యగా షఫాతున్నీ బీబీ కూడ జాతీయోద్యమంలో తనదైన సాహసోపేత పాత్రను నిర్వహించి చరిత్ర పుటలకెక్కారు. ఆ భార్యాభర్తలు అద్వితీయమైన దేశభక్తితో మహాత్మాగాంధీ. మౌలానా ఆజాద్‌, పండిట్ నెహ్రూలచే గౌరవాభిమానాలను అందుకునాflన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా విరామం లేకుండా భర్త పలుమార్లు సుదీర్ఘ… జైలు జీవితం గడిపినప్పటికీ ఏ మాత్రం అధైర్యపడకుండా లక్ష్యసాధనకు భర్తతోపాటు పలు కష్టాల కడగండ్లను ఎంతో సాహసంతో అనుభవించిన ఆమె సహనశీలి.

ఆమె భర్త మాత్రమే కాక కుమారులు కూడ స్వాతంత్య్రసంగ్రామంలో భాగస్వాములు. అజ్ఞాతం, అరెస్టులు, జైళ్ళలో గడపటం మూలంగా ఆ కుటుంబం దుర్భరమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంది. ఏరోజుకారోజు తిండితిప్పల కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రోజు గడవటం కూడ కనాకష్టమైన దశలో షఫాతున్నీసా ఆ విచారకర విషయాలను జైళ్ళల్లో మగ్గుతున్న భర్త బిడ్డలకు తెలియ నివ్వకుండ గుట్టుగా గడుపుతూ ఆ యోధాులను ప్రోత్సహించారు. ఆర్థిక కడగండ్లనుఎదుర్కొంటున్నా, తనవద్దనున్న కొద్దిపాటి ఆర్థికవనరులతో జాతీయోద్యమంలోపాల్గొంటున్న ఇతర ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకున్నారు. ఉద్యమకారుల

146