పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు


కుటుంబాలు ఎటువంటి దుర్భర, దారుణ పరిస్థితులను అనుభవించాల్సి వస్తుందో అనుభవపూర్వకంగా తెలిసిన ఉద్యమకారిణి కనుక ఉన్నంతలో ఇతరులను ఆదుకుంటూ, మంచి రోజులు ముందున్నాయని ఆ ఉద్యామకారుల కుటుంబ స్త్రీలకు ధైర్యం చెప్పటం విశేషం. ఆ కార్యక్రమంలో భాగంగా ఆమె ముస్లిం మహిళలకు ఖురాన్‌ అధ్యాయనంలో శిక్షణ ఇచ్చారు. ఈ మేరకు పాకిస్థాన్‌ ఏర్పడేంతవరకు పదివేల మంది ఆమె నుండి లబ్దిపొందినట్టు సమాచారం. (Encyclopaedia of Muslim Biography Vol. 4, NK Singh, APH Publishing Corporation, New Delhi,2001, Page. 233)

ఖద్దరు ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రజలలో ప్రదానంగా మహిళలలో ఖద్ధరు ధారణను ప్రోత్సహించారు. ఆమె కుటుంబ సభ్యులంతా ఖద్దరు ధరించారు. ఆమె భర్తతోపాటుగా జమాఅత్‌ ఉలేమా- యే-హింద్‌, (Jamaiatul Ulema-e-hindi.), భారత జాతీయ కాంగ్రెస్‌లో సభ్యత్వం స్వీకరించారు. ఆయా సంస్థల పిలుపు మేరకు జరిగిన పలు కార్యక్రమాలలో చురుకైన భాగస్వామ్యం అందించారు. 1922 నాటి సంఘ టన. జాతీయోద్యామ కారులైన షఫాతున్నీసా భర్త, బిడ్డలూ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. న్యాయస్థానం భర్తకు ఒక సంవత్సరం జైలుశిక్షతోపాటుగా వెయ్యి రూపాయల జరిమానా విధించింది. ఆ జరిమానా చెల్లించేందుకు మౌలానా హబీబుర్రెహమాన్‌ నిరాకరించారు. ఆ సొమ్మును వసూలు చేయాలన్నసాకుతో ఆయన గృహాన్ని సోదా చేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. ఆ సమయంలో షఫాతున్నీ సా లూధియానాలోని తన మట్టి ఇంటిలో చిన్న పిల్లలతో అతికష్టం మీదా కాలం గడుపుతున్నారు.

సోదా చేసేందుకు పోలీసులు ఆమె ఇంటిని చుట్టుముట్టారు. ఆమె పర్దానషీ మహిళ అని కూడ చూడకుండ పోలీసులు తమ సహజ శెలిని ప్రదర్శించారు. ఏమాత్రం అధైర్యపడకుండ సోదాకు వీలు కల్పించి ఆమె పక్క కు తప్పుకున్నారు. పోలీసులు యధాప్రకారంగా విధ్వంసం సృష్టించారు. ఆహార పదార్ధాలను నిత్యావసర వస్తువులను నేలపాలు చేశారు. చివరకు చిన్న బిడ్డల చెవుల్లోని దుద్దులను కూడ లాక్కెళ్ళారు. అంత జరిగినా పోలీసులు వెళ్ళిపోయాక తన బిడ్డలను ఒడిన చేర్చుకుని ఏమీ జరగనట్లు ప్రశాంతంగా ఆమె తన కార్యక్రమాలలో నిమగ్నమై పోయారు. (Bharath Ke Swatantra Samgram me Muslim Mahilavonka Yogdaan, Dr. Abida Sameeuddin, IOS, New

147