పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌కు స్పూర్తి ప్రదాత

జులేఖా బేగం

(1893-1942)

భర్తతో పాటు భుజం భుజం కలిపి కొందరు మహిళలు జాతీయోద్యమంలో పాల్గొంటే, ఉద్యమకారుడైన భర్త దృష్టిని కుటుంబ సమస్యల వైపుకు మళ్ళనివ్వకుండ స్పూర్తిని ప్రసాదించిన మహిళామణులు మరికొందరు. ఈ మేరకు పోరాట జీవితంలోని కడగండ్లను స్వయంగా భరించి స్వాతంత్య్ర సమరయాధు డైన జీవిత భాగస్వామిని మాతృదేశ సేవకు అర్పించిన సతీమణులలో ప్రముఖులు శ్రీమతి జులేఖా బేగం.

దశాబ్దానికి పైగా జైలు జీవితం గడిపిన మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ భార్య బేగం జులేఖా 1892-93 ప్రాంతంలో పశ్చిమ బెంగాల్‌లో జన్మించారు. ఆమెకు 7-8 సంవత్సరాల వయస్సు ఉండగా అనగా 1900-01 ప్రాంతంలో 12-13 ఏండ్ల వయస్కుడైన అబుల్‌ కలాం ఆజాద్‌తో వివాహం జరిగింది. ఆ ఇద్దరు తగిన వయస్సు వచ్చాక భార్యభర్తలుగా నూతన జీవితాన్ని ఆరంభించారు. (మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ (హిందీ), క.సి యాదవ్, హోప్‌ ఇండియా పబ్లికషన్స్‌ , గుర్‌గావ్‌, 2004, పేజీ.17). ఆ దంపతులకు హసీన్‌ అను కుమారుడు కలిగాడు. బ్రిటిషు వ్యతిరేక పోరాటంలో నిరంతరం గడుపుతున్న భర్త ఇంట ఉంటున్న సమయం తక్కువ కావటంతో కుమారుడి

129