పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

రాక ఆమెకు కొంత ఊరట కలిగించింది. కానీ ఆ సంతోషం ఎంతోకాలం నిలువలేదు. తల్లితండ్రులమయ్యామని మౌలానా దాంపతులు సంతోషించేలోగా నాలుగు సంవత్సరాల వయస్సు గల ఆ పిల్లవాడు మరణించాడు. కుమారుని మరణం జులేఖా బేగం దంపతు లను కలచి వేసింది.

జులేఖా బేగం నూతన జీవితాన్ని ఆరంభించేందుకు మెట్టినింట అడుగు పెట్టేసరికి మౌలానా ఆజాద్‌ బ్రిటిషు వ్యతిరేక పోరాటంలో భాగస్వాములయ్యారు. విప్లవోద్యమంతో బ్రిటిషు వ్యతిరేక పోరాటాన్ని ప్రారంభించిన ఆయన ఆ తరువాత మహాత్ముని మార్గంలో పయనం ఆరంభించారు. మౌలానా బెంగాల్‌ కేంద్రాంగా జాతీయోద్యమంలో క్రియాశీలక పాత్రను స్వీకరించి బాధ్యతలు నిర్వహించసాగారు. అచిరకాలంలోనే ఉర్దూ పత్రిక అల్‌ హిలాల్‌ సంపాదకునిగా, రచయితగా, బ్రిటిష్‌ ప్రభుత్వ వ్యతిరేక పోరాటయోధుడిగా రూపొందిన మౌలానా క్షణం తీరుబడి లేకుండా కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. ఆ విధగా మౌలానా రచయితగా సాహిత్యరంగంలో శ్రమిసున్నా, విముక్తి పోరాట యోధు డిగా రాజకీయ రంగంలో నిమగ్నమైయున్నా జులేఖా బేగం ఆయనకు నిరంతరం తోడ్పాటునందించారు. ఏ విధమైన కష్టం కలగకుండా, ఆయన దృష్టి కుటుంబ సమస్యల మీదకు మళ్ళకుండా ఆమె జాగ్రత్తలు తీసుకున్నారు.

మౌలానా ఆజాద్‌ 1916లో మొట్టమొదట సారిగా నిర్బంధానికి గురయ్యారు. ఆ సందర్భంగా ఆమె మానసిక స్థితిని తెలియచేస్తూ ఆజాద్‌ ఇలా రాశారు. ఆమె తన భావోద్వేగతను ఆపుకోలేకపోయింది. తరువాత చాలా కాలం వరకూ నేనామెను క్షమించ లేదు. ఆ సంఘటన ఆమెను పూర్తిగా మార్చివేసింది. నా జీవితంలోని ఒడిదుడుకులను తట్టుకు ని నిలబడే స్థయిర్యాన్ని అలవర్చుకుంది. (అబుల్‌ కలామ్‌ ఆజాద్‌, అర్షమల్సియాని, భారత ప్రభుత్వ ప్రచురణలు, న్యూఢిల్లీ, 1983. పేజీ.111) ఆ నిర్బంధం సందర్భంగా రాంచీలో ఆయన మూడు సంవత్సరాలు గడపారు. ఆ సమయంలో ఆమె భర్త నిర్వహిస్తున్న కార్యక్రమాలు కుంటుపడకుండా తన పరిధుల మేరకు స్వయంగా చర్య లు తీసుకున్నారు.

1920లో మౌలానా జైలు నుండి విడుదల కాగానే ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. మౌలానా ఇల్లు విడిచి, ఇల్లాలిని మరచి ఖిలాపత్‌-సహాయ నిరాకరణ ఉద్యామానికి పూర్తిగా అంకితమయ్యారు. ఈ సందర్భంగా బ్రిటిషు పాలకుల చర్య లను విమర్శిసూ, వారి చర్య ల మీద నిప్పులు చెరిగే ఉపన్యాసాలు చేస్తూ పర్య టనలు


130